iDreamPost

పట్టిసీమ ఎత్తిపోతల్లో అగ్నిప్రమాదం

పట్టిసీమ ఎత్తిపోతల్లో అగ్నిప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వద్ద గోదావరి ఒడ్డున నిర్మించిన పట్టిసీమ ఎత్తి పోతల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు 220 కేవీ సామర్ధ్యంతో సబ్ స్టేషన్ నిర్మించారు. అక్కడ మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, శనివారం రాత్రి ఒక ట్రాన్స్ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడడంతో సమీప గ్రామాల ప్రజలు భయకంపితులయ్యారు. మిగిలిన రెండు ట్రాన్స్ఫార్మలకు ఎక్కడ మంటలు అంటుకుంయోనని సిబ్బంది ఆందోళన చెందారు.

ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో సబ్ స్టేషన్ కి కూత వేటు దూరంలోనే ఎత్తి పోతల పధకానికి ఎలాంటి నష్టం జరగలేదు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలవరం అగ్నిమాపక సిబ్బంది మాటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

కాగా, 15 రోజుల క్రితమే పట్టిసీమ నుంచి నీటిని తోడడం ఆపేసారు. ఇక్కడ నుంచి పోలవరం కుడి కాలువలోకి నీటిని పంప్ చేసి విజయవాడ కృష్ణ బ్యారేజిలోకి గోదావరి జలాలను పంపుతున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి