iDreamPost

నిబంధనలు ఉల్లఘించిన ఎమ్మెల్యే – కేసు నమోదు

నిబంధనలు ఉల్లఘించిన ఎమ్మెల్యే – కేసు నమోదు

సాయం చేయడం మంచిదే.. కానీ ఆ సాయం వల్ల మంచికంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటే ఆ సాయాన్ని తప్పుగా పరిగణిస్తారని ఓ ఎమ్మెల్యే చేసిన నిర్వాకంతో మరోసారి రుజువైంది.

వివరాల్లోకి వెళితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే శైలేష్ పాండేపై ఐపీసీ సెక్షన్ 188, 144, 279 ల ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దీంతో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 144 సెక్షన్ విధిస్తూ సీఎం భూపేష్ భాగేల్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పలువురు పేదవారికి సహాయం చేసే ఉద్దేశ్యంతో బిలాస్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పాండే ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం ప్రారంభించారు. ఉచిత రేషన్ ఇస్తున్నారని తెలియడంతో ప్రజలంతా పెద్ద సంఖ్యలో గుమిగూడి రేషన్ తీసుకోవడం ప్రారంభించారు. దాంతో పోలీసులకి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారని పిర్యాదు అందడంతో రేషన్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీంతో శైలేష్ పాండే చేసిన సాయం కాస్త నేరంగా మారిపోయింది.

సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా గుంపులుగా ఉండొద్దని లాక్ డౌన్ నిబంధనలు పెట్టినా కొందరు అత్యుత్సాహంతో చేసే పనుల వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.. సాయం చేయడం మంచిదే. కానీ నిబంధనలు అతిక్రమించి మరీ సాయం చేయకూడదని అలా చేస్తే ఇలా మొదటికే మోసం వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి