iDreamPost

థియేటర్లు షూటింగుల గురించి ఏం చెప్పారు ?

థియేటర్లు షూటింగుల గురించి ఏం చెప్పారు ?

ఇవాళ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి అధ్యక్షతన ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. లాక్ డౌన్ టైంలో మొదటిసారి చేసిన సమావేశం కావడంతో ఏవైనా కీలక నిర్ణయాలు ఉంటాయనే ఉద్దేశంతో మీడియా ప్రతినిధులు కూడా తరలి వచ్చారు. అయితే పూర్తి స్థాయి స్పష్టతనివ్వకుండానే ముగించేయడం కొంత అయోమయాన్ని మిగిల్చింది. పరిస్థితులను బట్టి జూన్ లేదా జులై నుంచి షూటింగులకు అనుమతి ఇచ్చేలా చర్యలు చేపడతామని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఒక నిర్ణయమైతే ఉంటుందనే హింట్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస యాదవ్.

ఇటీవలే టీవీ ఛానల్స్ తరఫున కొందరు సీరియల్స్ షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలని వినోదం లేక ప్రేక్షకులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని మంత్రి గారికి ఇటీవలే వినతి పత్రం కూడా అందజేశారు. మరోవైపు పరిశ్రమ నుంచి సైతం పెద్దలు తమ విన్నపాలు వివిధ రూపాల్లో ఇస్తూనే ఉన్నారు. మొత్తానికి ప్రెస్ మీట్ అయితే ముగిసింది కానీ కంక్లూజన్ మాత్రమ్ దొరకలేదు. నిజానికి కరోనా తాకిడి ఎన్ని రోజుల్లో తగ్గుతుందనే దాని మీద ప్రభుత్వాలతో సహా ఎవరికి క్లారిటీ లేదు . అది తెలిస్తే ఫలానా టైం నుంచి షూటింగులు చేసుకోమని హామీ వచ్చేది. కాని పరిస్థితి అలా లేదు.

థియేటర్లు మాత్రం సెప్టెంబర్ లో తెరుచుకుంటాయనే టాక్ మాత్రం బలంగా ఉంది. ఒకవేళ దాని కన్నా ముందే కరోనా కేసులు జీరో అయితే సానుకూల నిర్ణయం ఉండొచ్చు. ఇదంతా తీవ్ర అనిశ్చితి తప్ప మరొకటి కాదు. ఒక నమ్మకం కలిగించడం కోసం తప్ప నిజానికి మంత్రి ప్రెస్ మీట్ లో ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. ఇప్పటికే రోజువారి వేతనాల మీద ఆధారపడే లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చారిటిలు చేపడుతున్న కార్యక్రమాల ద్వారా తిండి దొరుకుతోంది కాని ఇతరత్రా అవసరాలు తీరడానికి ఎలాంటి ఆదాయం లేదు. లాక్ డౌన్ పూర్తిగా తొలగిపోయాక కాని ఎవరైనా ఏమి చెప్పలేరు. జనానికి ప్రధాన వినోద సాధనమైన సినిమా రంగం మినహాయింపుల్లో మాత్రం చివరి స్థానంలో నిలవాల్సి రావడం విచారకరం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి