iDreamPost

మోడీ ఎఫెక్ట్.. మాల్దీవుల పార్లమెంటులో MPల మధ్య WWE ఫైట్

ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవ్స్ కు గడ్డుపరిస్థితులు దాపరించాయి. జాగా మాల్దీవుల పార్లమెంట్ లో రణరంగం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎంపీలు డబ్య్లూ డబ్య్లూఈ రేంజ్ లో ఫైట్ కు దిగారు.

ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవ్స్ కు గడ్డుపరిస్థితులు దాపరించాయి. జాగా మాల్దీవుల పార్లమెంట్ లో రణరంగం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎంపీలు డబ్య్లూ డబ్య్లూఈ రేంజ్ లో ఫైట్ కు దిగారు.

మోడీ ఎఫెక్ట్.. మాల్దీవుల పార్లమెంటులో MPల మధ్య WWE ఫైట్

ఇటీవల మాల్దీవుల అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మాల్దీవులు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాయి. ప్రధాని మోడీ లక్షద్వీప్ లో పర్యటించి అక్కడి బీచ్ అందాలను సముద్రం వద్ద దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. పర్యాటకులు లక్షద్వీప్ ను తమ లిస్టులో చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇక దీనిపై మల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో భారతీయులు బాయ్ కట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరలేపారు. ఇక ప్రధాని మోడీపై మల్దీవులు మంత్రులు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడి ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.

ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవ్స్ కు గడ్డుపరిస్థితులు దాపరించాయి. అక్కడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తాజాగా మాల్దీవుల పార్లమెంట్ లో రణరంగం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎంపీలు డబ్య్లూ డబ్య్లూఈ రేంజ్ లో ఫైట్ కు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికి పోయింది. మహమ్మద్‌ ముయిజ్జు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఓ తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీలు బాహాభాహీకి దిగారు.

fight in maldives parliment

మాల్దీవుల కెబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ లో రణరంగం సృష్టించారు. అధికారంలో భాగస్వాములైన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ), ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవులు ఎంపీలు, విపక్ష మాల్దీవన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎండీపీ) ఎంపీల మధ్య ఏర్పడిన వివాదం ఈ ఘర్షణకు దారితీసింది. ఎంపీలు ఒకరిని ఒకరు పొట్టుపొట్టు కొట్టుకున్నరు. పోడియం పైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొందరు సభ్యులూ అక్కడికి చేరుకొని స్పీకర్‌తో పాటు అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. బెంచీల పైనుంచి దూసుకెళ్లారు. స్పీకర్‌ను తోసివేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతుండగా ఇందులో ఒక ఎంపీ కాలుతో తన్నుతుండటం ఆ వీడియోల్లో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యంగా ఇది కామెడీ షో కాదు.. మాల్దీవ్స్ పార్లమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి