iDreamPost

‘మంచి’ సినిమాలంటే ఇలా ఉండాలి – Nostalgia

‘మంచి’ సినిమాలంటే ఇలా ఉండాలి – Nostalgia

ఇటీవలే సంక్రాంతి పండక్కి స్టార్ల మధ్య పోటీపడి నలిగిపోయిన ఎంత మంచివాడవురా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. సెలవుల పుణ్యమాని కొంత, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుల రద్దీ ప్రభావం కొంత మొత్తంగా కళ్యాణ్ రామ్ సినిమా ఎంతో కొంత రాబట్టుకున్న మాట నిజం. అయితే ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఇంత పోటీలో విడుదల చేయకూడదని, మాములు టైంలో అయితే ఇంకా బాగా ఆడేదని అంటున్న వారు లేకపోలేదు. నిజానికి కుటుంబ చిత్రాల ప్రేక్షకులంటూ విడిగా ఎవరూ ఉండరు. మాస్ లో ఉంటారు క్లాస్ లోనూ ఉంటారు. వాళ్లకు నచ్చే కంటెంట్ ఇవ్వాలంతే. 

Read Also: నారప్ప ఉగ్రరూపం : ఫస్ట్ లుక్

కొన్ని ఉదాహరణలు చూస్తే దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు . అప్పట్లో సీతారామయ్య గారి మనవరాలు సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ అయ్యింది. ఏజ్ బార్ లో ఉన్న ఏఎన్ఆర్ ప్రధాన పాత్రలో అప్ కమింగ్ స్టేజిలో ఉన్న మీనా హీరొయిన్ గా విడుదల చేసిన ఈ ఎమోషనల్ డ్రామా అద్భుత విజయాన్ని అందుకుని శతదినోత్సవం కూడా చేసుకుంది. కీరవాణి పాటలు, క్రాంతి కుమార్ దర్శకత్వం పెద్ద స్థాయికి తీసుకెళ్ళాయి. బాలకృష్ణ హీరోగా భానుమతి గారిని బామ్మ పాత్రలో చూపించిన మంగమ్మ గారి మనవడు ఏకంగా డైమండ్ జుబ్లీ ఆడింది. అప్పటికి బాలయ్య స్టార్ కాదు. ఇంకా ఎదిగే క్రమంలోనే ఉన్నాడు. 

Read Also: పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి?

కన్నీళ్ళు పెట్టకుండా ఏ ప్రేక్షకుడు బయటికి రాని మాతృదేవోభవలో హీరో హీరొయిన్ కూడా ఉండరు. కేవలం పాత్రలు మాత్రమే ఉంటాయి. అయినా పబ్లిక్ తండోపతండాలుగా చూసి మరపురాని విజయాన్ని అందించారు. అప్పటివి పాతవి అనుకుంటే మూడేళ్ళ క్రితం వచ్చిన శతమానంభవతి చిరంజీవి, బాలకృష్ణ లాంటి అతిరధుల పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు జాతీయ అవార్డు కూడా సాధించింది. స్వర్గం నరకం, అమ్మ రాజీనామా, బంగారు కుటుంబం, కలికాలం, సంసారం ఒక చదరంగం ఇలాంటి ఎన్నో సినిమాలు తారాబలం లేకపోయినా కేవలం ఎమోషన్ ని ఆధారంగా చేసుకుని జనాన్ని మెప్పించినవి. అందుకే వీటిని మంచి సినిమాలుగా జనం తమ హృదయాల్లో చెరిగిపోని స్థానం ఇచ్చారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి