iDreamPost

డిజిటల్ లో బాలీవుడ్ బ్లాస్ట్

డిజిటల్ లో బాలీవుడ్  బ్లాస్ట్

కరోనా ప్రకంపనలు సినిమా రంగం మీద మాములుగా లేవు. ఒకవైపు ప్రాంతీయ బాషల నిర్మాతలు ఓటిటికి ఓటు వేయాలా వద్దా అనే అయోమయంలో కొనసాగుతుండగా మరోవైపు బాలీవుడ్ లో మాత్రం భారీ చిత్రాలు డిజిటల్ రిలీజ్ కోసం పరుగులు పెడుతున్నాయి. స్ట్రీమింగ్ సంస్థలు ఇస్తున్న ఊరించే ఆఫర్లతో పాటు దేశంలో వైరస్ ఇంకా పూర్తిగా అదుపు కానీ కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుస్తారన్న నమ్మకం వాళ్లలో సన్నగిల్లుతోంది. అందుకే ఒక్కొక్కరుగా తమ హక్కులను ఇచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ ఈ రేస్ లో అందరి కంటే ముందున్నట్టు అప్ డేట్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా ఒక కంక్లూజన్ కు వచ్చినట్టు సమాచారం.

అదే నిజమైతే సుమారు 8 సినిమాలు ఓటిటిలో రాబోతున్నాయి. ఏదీ చిన్న బడ్జెట్ మూవీ కాకపోవడం గమనార్హం. ఇందులో ముందు నుంచి వినిపిస్తున్న పేరు ‘లక్స్మీ బాంబ్’. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో కాంచన రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీకి 150 కోట్ల డీల్ జరిగిందని గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉంది. అజయ్ దేవగన్ భుజ్, మహేష్ భట్ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ సడక్ 2, అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దిల్ బేచారా, కృతి సనన్ మిమి, సన్నీ కౌశల్ శిద్దాత్, కునాల్ కెమ్ము లూట్ కేస్ హాట్ స్టార్ లిస్ట్ లో ఉన్నాయట. వీటిలో అధిక శాతం డీలింగ్ కూడా క్లోజ్ చేసుకున్నాయని వినిపిస్తోంది., డిస్నీతో జత కూడినప్పటి నుంచి హాట్ స్టార్ మంచి దూకుడు మీదుంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కు గట్టి పోటీ ఇచ్చేలా పక్కా ప్లానింగ్ తో ఎత్తుగడలు వేస్తోంది.

సినిమాకు అయిన బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని హక్కుల కోసం ఆఫర్ చేస్తూ నిర్మాతలకు టెంప్ట్ చేస్తోంది. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకో నాలుగైదు నెలలు అవసరం పడేలా ఉండటంతో వీళ్లంతా ఓటిటి దారిలో పడుతున్నట్టు కనిపిస్తోంది. సూర్య వంశీ, 83 నిర్మాతలు ఇప్పటికైతే థియేట్రికల్ రిలీజ్ కు కట్టుబడ్డారు కానీ వాళ్ళ మనసు మారినా ఆశ్చర్యం లేదని ముంబై టాక్ . మొత్తానికి హింది ప్రొడ్యూసర్లు సాహసం చేసి పెట్టుబడులు వెనక్కు తెచ్చుకోవడం మీదే మొగ్గు చూపుతున్నారు తప్ప ధియేటర్లోనే తమ సినిమా అందించాలనే తాపత్రయంతో అయితే లేరు. మరి వీళ్ళ ధోరణి మిగలిన వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుందా. ఏమో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి