iDreamPost

మునుగోడులో గెలుపును డిసైడ్ చేసేది వాళ్లే.. టెన్షన్ పెరుగుతోందిగా?

మునుగోడులో గెలుపును డిసైడ్ చేసేది వాళ్లే.. టెన్షన్ పెరుగుతోందిగా?

  • హస్తానికి పడే ఓట్లే నిర్ణయాత్మకమా..?
  • కాంగ్రెస్ ఓట్ల చీలికపై కమలం ఫోకస్ పెట్టిందా..?
  • అక్కడ బీఎస్పీ ప్రభావం ఏమైనా ఉంటుందా..?

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుంటే, మునుగోడుతో రాష్ట్ర రాజకీయాలను మార్చాలని బీజేపీ తపనపడుతోంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మునుగోడు మాదే అని పట్టు పట్టింది. అయితే అక్కడ ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక పార్టీ కేంద్రంలో, మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనలోనే ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కంచుకోట అయిన మునుగోడులో ఈసారి మాత్రం ఆ పార్టీకి ప్రధాన పార్టీలను ఢీకొట్టెంత శక్తి లేనట్టే కనిపిస్తోంది. కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీల్లో గెలుపును డిసైడ్ చేసేది మాత్రం ఆ పార్టీనే అని స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎక్కువ స్థాయిలో ఓట్లు పడితే అంత నష్టం జరుగుతుందని కమలం పార్టీ ఆందోళన చెందుతుందని తెలుస్తోంది. దీంతో ఆ ఓట్లను చీల్చి తమవైపు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్ కు అధిక శాతం ఓట్లు పడితే టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఓట్ల చీలికపైనే కమలం పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అనే లాజిక్ పట్టుకున్న గులాబీ పార్టీ వీలైనన్ని ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మునుగోడు లో బీఎస్పీ ప్రభావం కూడా ఉండొచ్చనే భయం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను వెంటాడుతోంది. ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా కొద్ది ఓట్ల తేడాతో గెలుస్తారన్న భావనతో ప్రతి ఓటును కీలకంగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే బీఎస్పీ చీల్చే ఓట్లతో పాటు అటు రోడ్డు రోలర్ గుర్తు కారును డామేజ్ చేస్తుందా అని టీఆర్ఎస్ నేతలు కలవర పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా గెలుస్తుందా అనే అంశం కంటే కాంగ్రెస్, బీఎస్పీ కు ఎన్ని ఓట్లు చిలుస్తాయేనే విషయం పైనే పోకస్ పెట్టాయి రెండు ప్రధాన పార్టీలు.

ఏది ఏమైనా విజేతలేవరు.. పరాజితులు ఎవరన్నది తెల్చాల్సింది మునుగోడు ఓటర్లే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి