iDreamPost

దీపావళి బాక్సాఫీస్ విజేత ఎవరు

దీపావళి బాక్సాఫీస్ విజేత ఎవరు

టపాసుల పండగను టార్గెట్ చేసుకున్న వచ్చిన నాలుగు సినిమాల ఫలితాల మీద క్లారిటీ వచ్చేసింది. ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలకు భిన్నంగా లెక్కలు కనిపిస్తున్నాయి. ముందుగా ఓరి దేవుడా సంగతి చూస్తే డీసెంట్ రివ్యూలు, వెంకటేష్ స్పెషల్ రోల్ ఆశించిన గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. వసూళ్లు దారుణంగా లేవు కానీ ఆశించిన దానికన్నా తక్కువగా ఉన్న మాట వాస్తవం. నిన్న వీకెండ్ పర్లేదనిపించినప్పటికీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్, కోహ్లీ వీరవిహారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా అన్ని షోల ఫిగర్స్ ని బాగా దెబ్బ తీశాయి. దానికి తోడు సాయంత్రం జనాలు దీపావళి షాపింగ్, పాటాసుల కొనుగోలుతో తెగ బిజీ అయిపోయారు.

శివ కార్తికేయన్ ప్రిన్స్ సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు నిజమయ్యేలా కనిపించడం లేదు. రోజు రోజుకి డ్రాప్ శాతం పెరిగిపోతోంది. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 7 కోట్లను అందుకోవడం అసాధ్యమని ట్రేడ్ టాక్. ఇక మంచు విష్ణు జిన్నా ఏ దశలోనూ రికవరీ చూపించడం లేదు. తక్కువ బిజినెస్ జరుపుకున్నా రొటీన్ కథా కథనాలు జనాన్ని థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. సన్నీ లియోన్ కోసమో మాములు కామెడీ కోసమో పబ్లిక్ వచ్చే ట్రెండ్ కాదిది. కార్తీ సర్దార్ అన్నిటి కన్నా మెరుగ్గా వర్కౌట్ చేసుకుంటోంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఎక్కువ షేర్ వచ్చింది దీనికే. కొంత ల్యాగ్ తో పాటు కామెంట్స్ ఉన్నప్పటికీ ఫైనల్ గా యాక్షన్ లవర్స్ కు ఈ సినిమా నచ్చిన మాట వాస్తవం.

మూడు రోజుల ఓవరాల్ కలెక్షన్లు చూస్తే సర్దార్ 5 కోట్ల 50 లక్షలు, ఓరి దేవుడా 3 కోట్లు, ప్రిన్స్ 1 కోటి 80 లక్షలు, జిన్నా 40 లక్షల దాకా షేర్లు రాబట్టాయని సమాచారం. వీటిని బట్టి చూస్తే కార్తీనే ఫైనల్ విన్నర్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. దసరా సంక్రాంతిలా దీపావళికి ఎక్కువ రోజులు సెలవులు ఉండవు. కేవలం ఒకరు రోజు మాత్రమే ఇస్తారు. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడం ఇవి ఎలా వాడుకుంటాయో చూడాలి. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజుల అనుకోని ప్రయాణం మాత్రమే షెడ్యూల్ చేశారు. కంటెంట్ మెప్పించేలా ఉంటే సోలో రన్ తో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి టైపు లో నటకిరీటి హిట్టు కొడతారేమో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి