iDreamPost

ఫైనల్‌కి ముందే ఆసీస్‌లో ఓటమి భయం! హిట్‌మ్యాన్‌ ట్రాక్‌ రికార్డే కారణం!

ప్రపంచకప్ ఫైనల్ కి ముందు ఆస్ట్రేలియా జట్టులో ఓటమి భయం పట్టుకుంది. దానికి గల కారణం టీమిండియా సారథి రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఇదే ట్రాక్ రికార్డ్ కంగారులను కంగారెత్తిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

ప్రపంచకప్ ఫైనల్ కి ముందు ఆస్ట్రేలియా జట్టులో ఓటమి భయం పట్టుకుంది. దానికి గల కారణం టీమిండియా సారథి రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఇదే ట్రాక్ రికార్డ్ కంగారులను కంగారెత్తిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

ఫైనల్‌కి ముందే ఆసీస్‌లో ఓటమి భయం! హిట్‌మ్యాన్‌ ట్రాక్‌ రికార్డే కారణం!

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం భారత్- ఆస్ట్రేలియా మధ్య తుది పోరు జరుగబోతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇరు జట్లు ఢీకొనబోతున్నాయి. కోట్లాది మంది భారతీయుల కలలను నిజం చేసేందుకు రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఓటమెరుగని జట్టుగా ప్రపంచ కప్ ఫైనల్ లోకి రాయల్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫైనల్ కి ముందే ఆసిస్ జట్టులో భయం మొదలైంది. దానికి కారణం టీమిండియా సారథి రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్. కంగారులను కంగారెత్తించి ఖంగుతినిపించేందుకు హిట్ మ్యాన్ సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ ట్రాక్ రికార్డ్స్ ఏంటి? ఆ వివరాలు మీకోసం..

టీమిండియా సారథిగా జట్టుకు సూచనలు చేస్తూనే అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టుకు మంచి శుభారంబాన్ని అందిస్తున్నారు రోహిత్. శక్తి వంచన లేకుండా బ్యాటింగ్ చేస్తూ జట్టు విజయంలో కీలకంగా మారిపోయారు. రేపు జరుగనున్న ఫైనల్ మ్యాచ్ లో కూడా కంగారులపై విరుచుకుపడేందుకు రెడీ అయిపోయారు. కాగా రోహిత్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆసిస్ వెన్నులో వణుకు పుడుతోంది. ఫైనల్స్ కు ముందే ఆ జట్టులో కలవరం మొదలైంది. దీనికి గల కారణం ఏంటంటే.. రోహిత్ సారథ్యంలో ఆసిస్ జట్టుపై, ఎల్లో జర్సీ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలు. ఐపీఎల్ లో ముంబై జట్టు రోహిత్ కెప్టెన్సీలో ఐదు సార్లు టైటిల్ కొట్టింది. అందులో మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై విజయం సాధించింది. అంతేగాక ఛాపియన్ లీగ్ టీ 20 2013లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై విక్టరీ కొట్టింది.

తరువాత 2018 లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియానే విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో కూడా రోహిత్ కెప్టెన్సీలోని టీమిండియా విజయ ఢంకా మోగించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్స్ లో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. ఇలా టోర్నీ ఏదైనా తన దైన స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తూ జట్టును విజయ తీరాలకు చేరుస్తున్నారు హిట్ మ్యాన్. ముఖ్యంగా ఎల్లో జర్సీ ఉన్న చెన్నైపై ఐపీఎల్ లో ఎక్కువ సార్లు విజయం సాధించారు ముంబై ఇండియన్స్. ఇదే సెంటిమెంట్ మళ్లీ వరల్డ్ కప్ లో రిపీట్ కాబోతుందంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్లో జెర్సీ ఉన్న ఆసిస్ పై రోహిత్ సారథ్యంలోని భారత్ కప్ కొట్టి ప్రపంచ ఛాంపియన్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి