iDreamPost

ఘోరం.. కన్న కొడుకును చంపిన కసాయి తండ్రి.. అసలు ఏం జరిగిందంటే?

కన్న తండ్రే కాలయముడైండు. విచక్షణ కోల్పోయి కొడుకుపై దాడి చేసి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

కన్న తండ్రే కాలయముడైండు. విచక్షణ కోల్పోయి కొడుకుపై దాడి చేసి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఘోరం.. కన్న కొడుకును చంపిన కసాయి తండ్రి.. అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది మద్యం, మత్తు పదార్ధాలుకు బానిసలుగా తయరయ్యారు. చదువుకున్న పిల్లల సైతం వీటిని సేవించండం ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఈ మద్యం మత్తులో.. మందుబాబులు చేసిన అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మద్య పానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన అది లేనిదే కొంతమందికి రోజు కూడా గడవదు. ఉదయం నుంచి రాత్రి వరకు మత్తు అనే మైకంలో విహరిస్తూంటారు. దీనివల్ల వేలాదిమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలా మంది ఈ మద్యానికి బానిసయ్యి ఆనారోగ్యానికి గురై చిన్న వయస్సులోనే మరణిస్తున్నారు. కాగా, మరికొందరు ఈ మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. ఇక కొంతమంది అయితే ఈ మత్తులో ఏం చేస్తున్నాం అనేది తెలియకుండా మహిళల పై అత్యాచారాలు వంటి దారుణాలకు ఒడిగడతున్నారు. అసలు ఈ మద్యం మత్తులో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కొల్పోతుంటారు. ఈ క్రమంలోనే ఒకరి పై ఒకరు దాడులు చేసుకొవడం, రక్త సంబంధాలను కూడా చంపుకోవడం అనేది తరుచుగా చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది.

ఓ తండ్రి మద్యం మత్తులో క్షణికావేశంలో కన్న కొడుకును కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ తండ్రి కూడా పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో చోటుచేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. గుజ్జుల్ తండాకు చెందిన వసంతరావు -సరస్వతి దంపతుల కుమారుడైన సురేష్(22) గత ఐదు నెలల క్రితం దుబాయ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అయితే గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన గుజ్జుల్ కు సురేష్ వెళ్లాడు. కాగా, గల్ఫ్ లో ఉన్నప్పుడు పంపిన డబ్బుల విషయంలో.. తల్లి సరస్వతితో తండ్రి వసంతరావు గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే కుమారుడైన సురేష్ అడ్డుగా వచ్చాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి వసంతరావు(45) ఆగ్రహానికి గురై కుమారుడిపై కత్తితో చాతి, మెడ వీపు భాగంలో దాడి చేశాడు.

father killed his own son

అలా దాడికి గురైన సురేష్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే సురేష్ ను గాంధారి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే సురేష్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి తన కొడుకు మరణానికి కారణం అవ్వడంతో.. తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వసంతరావు ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వసంతరావు కూడా మృతి చెందాడు. కాగా ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. ఈ విషాద ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మృతిని భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి