iDreamPost

విధి ఆమె జీవితంపై పగబట్టింది.. అప్పుడు తల్లిదండ్రులు.. ఇప్పుడు

విధి ఆమె జీవితంపై  పగబట్టింది.. అప్పుడు తల్లిదండ్రులు.. ఇప్పుడు

విధి ఒక్కక్కరితో ఒక్కోలా ఆటలాడుతూ ఉంటుంది. విధి ఆడిన వింత నాటకంలో కేవలం మనం బొమ్మలు మాత్రమే. అది ఆడించినట్లు ఆడి.. సాగిపోవడమే. కానీ కొంత మంది విధిని ఎదిరించి గెలవడానికి ప్రయత్నాలు చేశారు. కొంత మంది ఓడిపోయి దానికి తలవంచుతున్నారు. అయినప్పటికీ ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని ఆపలేం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి జీవితంపై విధి పగబట్టింది. తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేసింది. ఆ బాధలను తట్టుకుని ఎదిగింది. తన మానాన తాను బతుకుతుంది. అయితే ఆమెను ప్రశాంతంగా ఎందుకు ఉంచాలునుకుందో ఏమో.. చివరకు ఆమెను కూడా అంధకారంలో నెట్టేసింది. జీవితంపై ఎన్నో ఆశలతో బతుకున్న యువతి కలలపై నీరు కాదూ నిప్పులు విసిరింది కాలం. ఇంతకు ఏమైందంటే..?

కృష్ణాజిల్లాలోని గుడివాడలోని కాకర్ల వీధికి చెందిన తోల జాహ్నవి సాయిశ్రీ జీవితానికి చెందిన వ్యథ ఇది. ఆమె పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోయాడు. మరో నాలుగేళ్లకు తల్లి కూడా మరణించింది. దీంతో ఆమెను అమ్మమ, తాతయ్యలు పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడకుండానే జాహ్నవి పెరిగింది. అయితే ఉద్యోగం నిమిత్తం పుట్టపర్తికి వెళ్లింది. అక్కడ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. అక్కడే నివాసం ఉంటుంది. కాగా, తన తాతకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో గుడివాడకు బయలు దేరింది. స్వస్థలం వెళ్లేందుకు పుట్టపర్తిలో యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. రైలు గుడివాడ స్టేషన్‌కు రాగా, ఆ విషయాన్ని జాహ్నవి గుర్తించలేదు.

రైలు ముందుకు సాగిపోయింది. గుడివాడ స్టేషన్ నుండి బయలు దేరి మందపాడు గేటు వద్దకు వచ్చింది. అయితే అంతలో తోటి ప్రయాణీకులు గుడివాడలో రైలు దిగలేదు ఏంటనీ జాహ్నవిని ప్రశ్నించారు. అప్పుడు కానీ గుడివాడ స్టేషన్ వచ్చి, వెళ్లిపోయిందన్న విషయాన్ని గమనించలేదు జాహ్నవి. దీంతో అప్పుడే తేరుకున్నఆమె.. ఆ స్టేషన్ వచ్చినట్లు గమనించలేదని తెలిపింది. వెంటనే కంగారుగా.. తన బ్యాగ్ తీసుకుని మందపాడు గేటు వద్ద దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ట్రైన్ డోర్ వద్ద నించుకుని గాబరా పడిపోయింది. అంతలో రైలు కుదుపులకు జారిపోయి కిందకు పడిపోగా.. ఆమె రెండు కాళ్లు చక్రాల కింద పడి నుజ్జు నుజ్జుయ్యాయి. ఆమెను వెంటనే విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి