iDreamPost

పడిపోతున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..?

చికెన్ కూర అంటే ఓ ఎమోషన్. కూర ఉడుకు తున్నప్పుడే ముక్కుకు వాసన చెబుతుంది. వెంటనే కంచంలో వేసుకుని తినేయాలనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలో కోడి మాంసం ధరలు కొండెనెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు..

చికెన్ కూర అంటే ఓ ఎమోషన్. కూర ఉడుకు తున్నప్పుడే ముక్కుకు వాసన చెబుతుంది. వెంటనే కంచంలో వేసుకుని తినేయాలనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలో కోడి మాంసం ధరలు కొండెనెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు..

పడిపోతున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..?

కంచంలో ముక్కలేనిదో ముద్ద దిగదు కొందరికీ. గతంలో ఆదివారం మాత్రమే స్పెషల్ కర్రీగా ఉండేది చికెన్. కానీ తర్వాత తర్వాతి కాలంలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెంది..చికెన్ విరివిగా లభిస్తుంది. ఫారెన్, బాయిలర్ వంటి కోళ్లు రావడంతో సామాన్యులు సైతం చికెన్ కొనుగోలు చేయగల్లుతున్నారు. దీంతో చికెన్‌తో చేయాల్సిన వంటలన్నీ చేసుకుని .. ఓ పట్టు పడుతున్నారు. ఇప్పడు సండేతో పని లేదు. ఎప్పుడు కోడికూర తినాలంటే..అప్పుడు చికెన్ షాపుకు వెళ్లి కొనుక్కుని తెచ్చేయడం.. అమ్మ వండి పెడితే.. కడుపారా ఆరగించడంతో సంపూర్ణం అవుతుంది. బిర్యానీ, కోడి పులావ్, చికెన్ ప్రై, చికెన్ కర్రీ.. ఇలా ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని చేసుకుని లాగించేస్తున్నారు.

మాంసాహార ప్రియులకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది చికెన్. దీంతో తొలుత తక్కువ రేట్ ఉన్నా కోడి మాంసం..రెక్కలు విప్పుకుని పెరుగుతూ వచ్చింది. మొన్నటి వరకు రూ. 250 క్రాస్ చేసి.. రూ. 300 చేరుకునేందుకు పరుగులు కూడా పెట్టింది. ఈ ధరలు చూసి.. వామ్మో అనుకున్నారు ప్రజలు కూడా. అయితే కార్తీక మాసంలో తగ్గిన కోడి ధర మెల్లిగా మళ్లీ పైపైకి ఎగబాకింది. ఇంతలో కొన్ని రోజుల నుండి తగ్గు ముఖం పడుతూ వస్తుంది. చికెన్ ధరలు తగ్గుతుంటే.. గుడ్డు ధర మాత్రం గుబులు పుట్టించింది. ఆరు రూపాయలు ఉంటే కోడి గుడ్డు ధర ఏడు రూపాయాలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చికెన్ ధర రూ. 130లు చూపిస్తోంది. అంటే సగానికి చికెన్ ధరలు పడిపోయాయి

లైవ్ చికెన్ కేజీ రూ. 130 ఉండగా.. చికెన్ రూ. 160 , స్కిన్ లెస్ చికెన్ రూ. 200 దగ్గర పలుకుతోంది. నాటు కోడి కేజీ రూ. 360గా చూపిస్తోంది. ఇక బోన్ లెస్ చికెన్ కేజీ 210 రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు సంక్రాంతి కావడంతో పాటు, ఇది మూఢ మాసం కారణంగా చాలా మంది చికెన్ తినడం తగ్గించారు. పండుగ ముందు నుండి శుచి, శుభ్రత అంటూ పాటించడం వల్ల.. చికెన్ వండటం కాదూ కదా.. కోడి మాసం కూడా కొనుగోలు చేయరు. కొనేవారు లేక కోడి బేల చూపులు చూస్తుంది. కొంత మంది దుకాణాదారులు ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. కేజీకి అర కేజీ కోడి కూర ఫ్రీ అని ప్రకటించినా కొనేవారు కరువయ్యారు. ఇక కనుమ రోజు నుండి చికెన్ ధరలు ఊపందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చికెన్ ధరలు తగ్గడానికి ఇంకేమీ కారణాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి