iDreamPost

ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ అగ్ని ప్రమాదం.. వేలాది మందిని కాపాడింది ఇతనే!

  • Author singhj Published - 12:02 PM, Mon - 10 July 23
  • Author singhj Published - 12:02 PM, Mon - 10 July 23
ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ అగ్ని ప్రమాదం.. వేలాది మందిని కాపాడింది ఇతనే!

రైళ్లలో ప్రయాణించాలంటే ప్యాసింజర్స్ హడలిపోతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని ఇంకా దేశ ప్రజలు మర్చిపోలేదు. కోరమాండల్ ఎక్స్​ప్రెస్​ యాక్సిడెంట్​లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయాలపాలయ్యారు. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనపై ఇంకా విచారణ సాగుతోంది. ఇందులో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే దాని పైనా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఈ కేసులో ఇటీవలే కీలక పరిణామం చోటుచేసుకుంది. సాక్షాలను నాశనం చేశారనే అభియోగాలపై ముగ్గురు రైల్వే అధికారులను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్​ను ఇంకా అందరూ మరువలేదు. ఈ టైమ్​లో తెలంగాణలో ఒక రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ ప్రమాదానికి గురైంది. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్​నుమా రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. రైలులో షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు ట్రైన్​ను నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. సరైన సమయానికి ప్యాసింజర్లు రైలులో నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ యాక్సిడెంట్​కు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనలో రైలులోని ఏడు బోగీలు దగ్ధమైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురి ప్రాణాలు కాపాడాడో యువకుడు.

సిగిల్ల రాజు అనే ఓ యువకుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైను లాగి.. తోటి ప్రయాణికులను అలర్ట్ చేశాడు. జిన్నారం, పాతపట్నానికి దగ్గర్లోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లాపురం పరిధిలోని లక్ష్మీనగర్​లో ఫ్యామిలీతో కలసి రెంట్​కు ఉంటున్నాడు. రైలు ప్రమాదం గురించి అతడు మాట్లాడుతూ.. ట్రైన్​లో ప్రయాణిస్తున్న టైమ్​లో పొగను గమనించి చైన్ లాగానని.. అప్పటికే ప్రయాణికులు భయపడి హాహాకారాలు చేస్తున్నారని రాజు అన్నాడు. అప్పటికే ఫైర్ ఇంజన్ సిబ్బందితో పాటు 108కి సమాచారం అందించానని అతడు చెప్పుకొచ్చాడు. ప్రమాద కేంద్రం తమ బెర్త్ వద్దే ఉందని.. పొగకు తన బ్యాగ్, నగదు దగ్ధమయ్యాయని పేర్కొన్నాడు. పొగ ఎక్కువగా పీల్చడంతో తాను స్పృహ తప్పి పడిపోయానన్నాడు. భువనగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చానని రాజు తెలిపాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి