iDreamPost

Faf Du Plessis: రీఎంట్రీపై డుప్లెసిస్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించలేదు!

  • Published Jan 09, 2024 | 8:34 AMUpdated Jan 09, 2024 | 8:34 AM

స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ తన రీఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని గురించి తెలిసిన అభిమానులు అతడి నుంచి ఇది అస్సలు ఊహించలేదని అంటున్నారు.

స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ తన రీఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని గురించి తెలిసిన అభిమానులు అతడి నుంచి ఇది అస్సలు ఊహించలేదని అంటున్నారు.

  • Published Jan 09, 2024 | 8:34 AMUpdated Jan 09, 2024 | 8:34 AM
Faf Du Plessis: రీఎంట్రీపై డుప్లెసిస్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించలేదు!

క్రికెట్​లో క్లాసిక్ బ్యాటింగ్​తో అలరించే వాళ్లు కొందరు ఉన్నారు. అదే టైమ్​లో ధనాధన్ ఇన్నింగ్స్​లతో మెస్మరైజ్ చేసేవారూ ఉన్నారు. కానీ క్లాస్​ షాట్స్ ఆడుతూనే అవసరాన్ని బట్టి పించ్ హిట్టింగ్ చేసేవాళ్లు మాత్రం చాలా అరుదు. అలాంటి వారిలో ఒకడు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్. వికెట్లు పడితే డిఫెన్స్ ఆడుతూ ఒక్కో రన్​తో ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. క్రీజులో సెటిలయ్యాక హిట్టింగ్​కు పర్ఫెక్ట్ టైమ్ అనుకున్నాడా.. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకుంటాడు. నిల్చున్న చోటు నుంచే అలవోకగా బౌండరీలు, సిక్సులు బాదడం అతడి స్పెషాలిటీ. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాలేకుండా అందర్నీ చితగ్గొడతాడు డుప్లెసిస్. ముఖ్యంగా టీ20 క్రికెట్​లో అతడు ఆడే తీరు, మ్యాచ్​లను ఫినిష్ చేసే విధానం సూపర్బ్ అనే చెప్పాలి. అలాంటి డుప్లెసిస్ తన రీఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడి నుంచి ఈ వ్యాఖ్యల్ని ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. అసలు, డుప్లెసిస్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి తాను మళ్లీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని డుప్లెసిస్ తెలిపాడు. ఈ ఏడాది జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్-2024లో ఆడాలని అనుకుంటున్నానని అన్నాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం ముఖ్యమని చెప్పాడు. ఎస్​ఏ టీ20 టోర్నమెంట్​ ఆరంభం సందర్భంగా అతడు పైవ్యాఖ్యలు చేశాడు. తాను గతంలో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోని, ఫ్లెమింగ్ దగ్గర నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. డగౌట్​లో కూర్చొని వాళ్లను ప్రశ్నలు అడుగుతూ, గమనిస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పాడు.

du plesis re entry

ధోని చాలా కూల్ కెప్టెన్ అని.. ఎంత ఒత్తిడి ఉన్నా అతడు కూల్​గా ఉంటాడన్నాడు. దీని వల్ల అపోజిషన్ బౌలింగ్ యూనిట్ ప్రెజర్​లో పడుతుందన్నాడు. మాహీ కెప్టెన్సీలో ఆడటం తన అదృష్టమని డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు. ఇక, డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. 2021, ఫిబ్రవరి 17న టెస్టులకు గుడ్​బై చెబుతున్నట్లు అతడు ప్రకటించాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​కు అతడు దూరమవడానికి క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్​ఏ)తో ఉన్న విభేదాలే కారణం. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్​లో కంటిన్యూ అవ్వాలనుకుంటే పూర్తి సమయం అందుబాటులో ఉండాలని డుప్లెసిస్​కు బోర్డు స్పష్టం చేసింది.

టీ20 లీగ్స్​లో ఆడాలనుకుంటున్నానని.. మొత్తం టైమ్​ను కేటాయించలేనని డుప్లెసిస్ చెప్పాడు. దీంతో అతడి సెంట్రల్ కాంట్రాక్ట్​ను సౌతాప్రికా క్రికెట్ బోర్డు రద్దు చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్-2021 టైమ్​లో డుప్లెసిస్​ను మళ్లీ టీమ్​లోకి తీసుకొచ్చేందుకు అప్పటి బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు మరోమారు అతడి రీఎంట్రీపై డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అయితే వరల్డ్ కప్​లో ఆడేందుకు డుప్లెసిస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ దేశ బోర్డు అతడి కాంట్రాక్ట్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. డుప్లెసిస్ రీఎంట్రీపై ఆసక్తి చూపిస్తుండటాన్ని అతడి ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. అతడి నుంచి ఇది ఊహించలేదని అంటున్నారు. మరి.. డుప్లెసిస్ రీఎంట్రీ ఇవ్వాలని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Mohammad Kaif: అన్నకు తగ్గ తమ్ముడు! ఆంధ్రా జట్టుపై చెలరేగిన షమీ సోదరుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి