iDreamPost

విద్యుత్ బిల్లుల అసలుగుట్టు బయటపడిందా ? క్లారిటి ఇచ్చిన విద్యుత్ శాఖ

విద్యుత్ బిల్లుల అసలుగుట్టు బయటపడిందా ? క్లారిటి ఇచ్చిన విద్యుత్ శాఖ

విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తోందంటూ చంద్రబాబునాయుడుతో సహా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్త డొల్లే అని తేలిపోయింది. తాజాగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించిన లెక్కల కారణంగా విద్యుత్ బిల్లుల ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది. లాక్ డౌన్ కారణంగా కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్న కారణంగా విద్యుత్ వినియోగం పెరగటంతో బిల్లులు పెరిగాయని అధికారులు చెప్పినా వినకుండా ప్రతిపక్షాలు కావాలనే గోల చేస్తున్నాయి. ఇంతకాలం నోటిమాటగా చెప్పిన వివరాలనే అధికారులు ఇపుడు లెక్కలతో సహ వివరించారు.

ఉన్నతాధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం 2019 మే నెలతో పోల్చుకుంటే 2020 మే నెలలో 7 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ఇలా ఎందుకు పెరిగిందంటే దాదాపు రెండు నెలలు వినియోగదారులందరూ కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ కారణంగా ఇళ్ళల్లోనే ఉండిపోయారు. అందరూ ఇళ్ళల్లోనే ఉండిపోవటంతో టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, ఏసిలు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, లైట్లు 24 గంటలూ పనిచేస్తునే ఉన్నాయి. ఇన్ని ఉపకరణాలు ఒక్కసారిగా పనిచేసినపుడు విద్యుత్ వాడకం పెరిగిపోకుండా ఎలాగుంటాయి ? వాడకం పెరిగిపోతే డెఫనెట్ గా శ్లాబు మారిపోతుంది. శ్లాబు మారిపోతే విద్యుత్ టారిఫ్ మారిపోయి బిల్లులు పెరిగిపోవటం సహజమే కదా ?

పోయిన సంవత్సరం ఏప్రిల్, మే నెలలో 1, 33, 41, 965 మంది వినియోగదారులు విద్యుత్ ను ఉపయోగించారు. అదే ప్రస్తుతం రెండు నెలల్లో 1, 36, 10, 220 మంది ఉపయోగించుకున్నారు. అంటే సుమారు 3 లక్షల మంది వినియోగదారులు ఒక్కసారిగా పెరిగారు. అలాగే 2019 ఏప్రిల్, మేనెలల్లో 2, 878. 49 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వాడారు. అదే ప్రస్తుత రెండు నెలల్లో 3,078. 69 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడారు. అంటే 7 శాతం వినియోగం పెరిగిందని తేలిపోయింది. అంటే దాదాపు 200. 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఎక్కువగా వాడుకున్నారని గణాంకాలతో సహా లెక్క తేలిపోయింది.

సరే ఇదే విషయాన్ని ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అనేక సార్లు వివరణలు ఇచ్చారు. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికెళ్ళి మరీ అధికారులు వివరించారు. అయినా ప్రతిపక్షాల నేతలు అధికారుల వివరణలను పట్టించుకోవటం లేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వంపై బురద చల్లాలన్న టార్గెట్ అర్ధమైపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి