iDreamPost

Salaar సలార్ మీద పడనున్న ఒత్తిడి

Salaar సలార్ మీద పడనున్న ఒత్తిడి

కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ నేరుగా సలార్ మీద ప్రభావం చూపిస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. కెజిఎఫ్ ప్రమోషన్లు ప్లస్ చిన్న చికిత్స కారణంగా ప్రభాస్ రెస్ట్ లో ఉండటం లాంటి కారణాలతో విరామం తీసుకున్నారు. ఇప్పుడవన్నీ కొలిక్కి వస్తున్నాయి. వచ్చే నెల నుంచి తిరిగి కొనసాగించేందుకు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు భాగాలా లేక ఒక పార్ట్ కే పరిమితమవుతారా అనే దానిమీద క్లారిటీ లేదు. ఫైనల్ రష్ చూసుకున్నాక కూడా నిర్ణయం మారొచ్చు. కెజిఎఫ్ కూడా సగం అయ్యాక అప్పటికిప్పుడు సీక్వెల్ ప్లానింగ్ చేసుకున్నారు.

సరే ఇదంతా బాగానే ఉంది కానీ సలార్ మీద కెజిఎఫ్ ఒత్తిడి పలు రకాలుగా ఉండబోతోంది. ముఖ్యంగా హీరోయిజం ఇంతకన్నా పీక్స్ ఉంటుందా అనే స్థాయిలో రాఖీ భాయ్ ని ప్రొజెక్ట్ చేసిన తర్వాత అంతకుమించి అనే స్థాయిలోనే సలార్ ఎలివేషన్స్ ని అభిమానులు ఆశిస్తారు. వీటిని అందుకోవడం అంత సులభం కాదు. పైగా బాహుబలి తర్వాత సాహో ఫలితం డార్లింగ్ ని నిరాశపరిచింది. ఏదో నార్త్ లో ఆడింది కదాని సంతృప్తి చెందినా రాధే శ్యామ్ మాత్రం వరల్డ్ వైడ్ గా తిరస్కారానికి గురయ్యింది. సో బలమైన కం బ్యాక్ చాలా అవసరం. అది సలార్ ద్వారానే సాధ్యమవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. ఇది ప్రశాంత్ మీద మరోరకంగా అదనపు ఒత్తిడి.

సలార్ కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ముందు అది పురుష్ వస్తుందా లేక దీన్ని విడుదల చేస్తారా అనే క్లారిటీ లేదు. కరోనా రెండు వేవ్స్ తర్వాత లెక్కలు మారిపోయాయి. దానికి తోడు సలార్ లో కొన్ని కీలకమైన మార్పులతో పాటు హోంబాలే ఫిలింస్ బడ్జెట్ ని బాగా పెంచబోతున్నట్టు టాక్ ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎన్ని వందల కోట్లతో తీస్తున్నారనే లీక్ బయటికి రాలేదు కానీ సాహో కన్నా తక్కువగానే ఉండొచ్చట. మొత్తానికి అన్ని కోణాల్లో ఈ ప్రెజర్ ని తట్టుకుని సలార్ ఎలా నెగ్గుకు వస్తాడో వేచి చూడాలి. ప్రభాస్ కూ దీని ఫలితం కీలకం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి