iDreamPost

BRSలో చేరిన మాజీ సైనికులు.. కిసాన్‌ సర్కార్‌ కోసం మేం సైతం అంటూ!

  • Published Jul 03, 2023 | 7:17 PMUpdated Jul 03, 2023 | 7:17 PM
  • Published Jul 03, 2023 | 7:17 PMUpdated Jul 03, 2023 | 7:17 PM
BRSలో చేరిన మాజీ సైనికులు.. కిసాన్‌ సర్కార్‌ కోసం మేం సైతం అంటూ!

కేసీఆర్‌ సర్కార్‌ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వినూత్న సంక్షేమ పథకాలను తీసుకువచ్చి.. అమలు పరిచి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. బంగారు తెలంగాణే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పని చేస్తోంది. దేశంలో కాషాయ పార్టీ ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి బీఆర్‌ఎస్‌ కృషి చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ విధనాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారు. ఇక తాజాగా మాజీ సైనికులు కొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరి.. గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో కిసాన్‌ సర్కార్‌ కోసం తాము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అన్నిరంగాల్లో పరివర్తన వస్తేనే గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతితో కూడిన నూతన శకానికి నాంది పలికేందుకు పాలనలో సమూల మార్పు రావాలని తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే బిఆర్‌ఎస్‌ నినాదానికి ప్రతిస్పందిస్తూ దేశ సైనికులు ముందుకు రావడం సంతోషదాయకమని, జీవితాల్లో గుణాత్మక మార్పును సాధించేందుకు మాజీ సైనికులు తమ కర్తవ్యాన్ని కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేసీఆర్‌. విశ్రాంత సైనికులు పెద్దఎత్తున తమ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన బీఆర్‌ఎస్‌ రైతుల తరఫున నిలబడ్డదని.. అన్నదాతలకు మద్దతిస్తుందని తెలిపారు.

ఇక కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో నాసిక్ జిల్లాకు చెందిన ‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి, ప్రముఖ మాజీ సైనికుడు సునీల్ బాపురావు పగారే ఉన్నారు. అలానే మాలేగావ్‌కు చెందిన ప్రవీణ్ ఆనంద్ థోక్, నాసిక్ నుంచి సాగర్ మాగ్రే, పూణే నుంచి తుకారాం దఫాద్, షోలాపూర్ నుండి సునీల్ అంధరే, షిరూర్ నుండి బాబన్ పవార్‌ తదితరులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి