iDreamPost

Peethala Sujatha: TDPలోని కొందరు దళితులను అవమానిస్తున్నారు: పీతల సుజాత

టీడీపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల ఎగసిపడుతున్నాయి. చాలా మంది సీనియర్ నేతలు సైతం టీడీపీ అధిష్టానపై గుర్రు మీద ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీపై సంచలన ఆరోపణలు చేసింది.

టీడీపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల ఎగసిపడుతున్నాయి. చాలా మంది సీనియర్ నేతలు సైతం టీడీపీ అధిష్టానపై గుర్రు మీద ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీపై సంచలన ఆరోపణలు చేసింది.

Peethala Sujatha: TDPలోని కొందరు దళితులను అవమానిస్తున్నారు: పీతల సుజాత

టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు అధికార వైఎస్సార్ సీపీలో  అభ్యర్థుల ప్రకటన సమయంలో జరిగిన చిన్న చిన్న అసంతృప్తులపై టీడీపీ పెద్దగా విమర్శలు చేసింది. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, చాలా మంది నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలకు అసలు సినిమా ఇప్పుడు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకు తగినట్లే ఇప్పటి వరకు టీడీపీ విడుదల చేసిన రెండు జాబితాల్లో చోటు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు తమ నిరసనలు నేరుగా అధిష్టానంకి తెలియజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీపై సంచలన ఆరోపణలు చేసింది.

ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి, టీడీపీ మహిళ నేత పీతల సుజాత తీవ్ర నిరాశకు గురయ్యారు. చింతలపూడి టికెట్ ను టీడీపీ అధిష్టానం సొంగా రోషన్ కుమార్ అనే ఎన్నారైకి కేటాయించారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి, నిరాశకు గురయ్యారు. దీంతో ఓ వీడియో చేసిన ఆమె..అందులో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పాటుపడుతున్న తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్కడో ఒక చోట తనకు టికెట్  కేటాయించాలని అధిష్టానానికి సుజాత విజ్ఞప్తి చేశారు.

Don't give a seat if there is no money

ఇదే సమయంలో టీడీపీపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా అంటూ ఆమె ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్‌ఆర్‌ఐలకు సీట్లు ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ సుజాత మండిపడ్డారు. టీడీపీలోని కొందరు పెత్తందారులు దళితులను అవమానిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదని, పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమె తెలిపారు. తన కుటుంబం 1982 నుంచి టీడీపీలోనే ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పని చేస్తే.. సీట్లేమో ఎన్నారైలకు ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు.

తనతో పాటు మాజీమంత్రి జవహర్‌కి కూడా టికెట్‌ ఇవ్వలేదని, తమలాంటి సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2015 నుంచి నియోజకవర్గంలో కొందరు నాయకులు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తాను బయటికొచ్చి మాట్లాడితే చంద్రబాబుకు, పార్టీకి చెడ్డపేరు వస్తుందని అన్నీ భరించానని తెలిపారు. 2019లో టికెట్ రాలేదని, అప్పటి నుంచి అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. ఈసారైనా టికెట్ ఇస్తారన్న తాను చూసిన ఎదురుచూపులు నిరాశనే మిగిల్చాయి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి పీతల సుజాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి