iDreamPost

హెన్రిచ్ క్లాసెన్ మెరుపు సెంచరీ.. ఇంగ్లండ్ బౌలర్లను పోయించాడుగా!

  • Author singhj Published - 06:22 PM, Sat - 21 October 23

సౌతాఫ్రికా బ్యాటింగ్ సెన్సేషన్ హెన్రిచ్ క్లాసెన్ తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. పటిష్టమైన ఇంగ్లండ్​పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు.

సౌతాఫ్రికా బ్యాటింగ్ సెన్సేషన్ హెన్రిచ్ క్లాసెన్ తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. పటిష్టమైన ఇంగ్లండ్​పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు.

  • Author singhj Published - 06:22 PM, Sat - 21 October 23
హెన్రిచ్ క్లాసెన్ మెరుపు సెంచరీ.. ఇంగ్లండ్ బౌలర్లను పోయించాడుగా!

క్రికెట్​లో ఎందరో బెస్ట్ బ్యాట్స్​మెన్​ ఉన్నారు. అయితే వారిలో కొందరు పేస్ బౌలింగ్​లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొందరు స్పిన్​ను దంచికొట్టడంలో స్పెషలిస్టులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ పేస్, స్పిన్​ను దీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించిన బ్యాటర్లు అతికొద్ది మందే ఉన్నారు. వాళ్లనే గ్రేట్ బ్యాట్స్​మెన్​గా చెబుతుంటారు. ఈతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లను దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్​గా చెప్పుకోవచ్చు. ఈ లిస్టులోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాడో క్రికెటర్. అతడే సౌతాఫ్రికా సెన్సేషన్ హెన్రిచ్ క్లాసెన్. సాధారణంగా ఫారెన్ బ్యాటర్స్ స్పిన్ సరిగ్గా ఆడరని అంటుంటారు. కానీ క్లాసెన్ మాత్రం పేస్​తో పాటు స్పిన్​ బౌలింగ్​లోనూ బ్యాట్​తో చెలరేగిపోతాడు.

సూపర్ ఫామ్​లో ఉన్న క్లాసెన్ వరల్డ్ కప్​లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో తానేంటో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. 61 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడీ డాషింగ్ బ్యాట్స్​మన్. 243 రన్స్​కు 5 వికెట్లు కోల్పోవడంతో సౌతాఫ్రికా 300 మార్క్​ను దాటుతుందో లేదోననే అనుమానం వచ్చింది. కానీ మార్కో జాన్సన్ (42 బంతుల్లో 75) తోడవడంతో క్లాసెన్ ఇంగ్లీష్ బౌలర్లను చితక్కొట్టాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్లు మార్చిన ఈ సఫారీ బ్యాటర్.. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును బుల్లెట్ స్పీడుతో పరిగెత్తించాడు. జాన్సన్ కూడా బ్యాట్​కు పని చెప్పడంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఏం చేయాలో తోచలేదు. 50 ఓవర్లకు సౌతాఫ్రికా 7 వికెట్లకు 399 రన్స్ చేసింది. వరల్డ్ కప్​లో ఇంగ్లండ్​పై ఇదే హయ్యెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. మరి.. క్లాసెన్ తుఫాన్ ఇన్నింగ్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సంజూ శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్.. వారికి వార్నింగ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి