iDreamPost

ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. Gmailకి పోటీగా..?

Elon Musk: ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే. అలానే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. జీమెయిల్ కి పోటీగా కొత్త ఫీచర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Elon Musk: ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే. అలానే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. జీమెయిల్ కి పోటీగా కొత్త ఫీచర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. Gmailకి పోటీగా..?

ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది. నెట్టింట్లో అనేక రకాల సోషల్ అకౌంట్లు ఉంటాయి. ఎంటర్ టైన్ మెంట్ కే కాకుండా సమాచారం చేరవేసుకునేందుకు కూడా ట్విట్టర్, జీమెయిల్ వంటివి కూడా ఉన్నాయి. ట్విట్టర్ ఎక్స్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. ఇక జీమెయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకుంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఈ పదం పరిచయమే. ప్రపంచంలో అత్యధికులు జీమెయిల్ నే వాడుతుంటారు. అలానే డిజిటల్ గా చేసే  ప్రతిపనికి దాదాపు జీమెయిల్ అవసరం అవుతుంది. కొన్ని ఏళ్ల నుంచి దీనికి పోటీగా నిలబడిన మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే తరచూ షాకింగ్ వార్తలు చెప్పే ఎలాన్ మస్క్..తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జీమెయిల్ కి పోటీగా ఓ కొత్త మెయిల్ తీసుకోస్తున్నట్లు సమాచారం.

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తరచూ సంచనల నిర్ణయాలు తీసుకుంటారు. కొంతకాలం క్రితం ట్విట్టర్ ను కొనుగోలు చేసి.. దానికి ఎక్స్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకాలం ట్విట్టర్ అందరికి సుపరిచితం కాగా.. కొత్తగా ఎక్స్ గా మారడంతో కాస్తా ఇబ్బందికి గురయ్యారు. అలా తొలి షాక్ ఇచ్చిన ఎలన్.. ఆ తరువాత నుంచి కూడా ఏదో ఒక  నిర్ణయంతో  అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ఆయన తీసుకున్న  ఏ నిర్ణయమైనా ఎప్పుడూ సంచలనమే. తాజాగా ఎలన్ మస్క్ మరో  సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు వినియోగించే గూగుల్ జీమెయిల్‌ కు పోటీగా ఎక్స్ మెయిల్  తీసుకొస్తామని తెలిపారు. ఎక్స్ మెయిల్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తోందని కీలక ప్రకటన చేశారు. అయితే రాబోయే ఎక్స్ మెయిల్ గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు ఎలన్. కానీ జీమెయిల్‌లో కనిపించని అనేక ఫీచర్లు ఇందులో తీసుకోస్తారని యూజర్లు భావిస్తున్నారు.  ఈ  విషయాన్ని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు.

దీంతో ఆయన ట్విట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఎక్స్ లో గూగుల్ జారీ చేసిన ఇమెయిల్ చిత్రం వైరల్ అయ్యింది. అందులో జీమెయిల్ ఆగష్టు 2024లో “సూర్యాస్తమయం” అని పోస్టు చేయబడి ఉంది. టెక్ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనపై ఎలాన్ మస్క్ స్పందిస్తుంటారు. అతను తరచుగా ఇతర టెక్ కంపెనీలపై మీమ్స్‌ను కూడా పోస్టు చేస్తుంటారు. తాజాగా ఎలాన్ గూగుల్ జీమెయిల్‌కి పోటీగా కొత్త యాప్‌ను తీసుకురానున్నట్లు పరోక్షం తెలిపారు.ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ఎక్స్ మార్చి.. అందులో గణనీయమైన మార్పులను కూడా అమలు చేశాడు. అలానే ఎక్స్ మెయిల్ కార్యరూపం దాల్చినట్లయితే, జీమెయిల్ తో పోటీ పడడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. కారణం, 2024 నాటికి, Gmail 1.8 బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి