iDreamPost

ట్విట్టర్ డీల్ కి తాత్కాలికంగా బ్రేక్ వేసిన ఎలన్ మస్క్

ట్విట్టర్ డీల్ కి తాత్కాలికంగా బ్రేక్ వేసిన ఎలన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఇటీవల 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్ ని కొనబోతున్నట్టు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలన్‌ మస్క్‌-ట్విట్టర్ మధ్య కొనుగోలు ఒప్పందం కూడా జరిగింది. అయితే ట్విట్టర్ ఇంకా ఎలన్‌ మస్క్‌ చేతికి రాలేదు. తాజాగా ఈ ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు.

44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌-ఎలన్‌ మస్క్‌ మధ్య కొనుగోలు ఒప్పందం జరగగా ఆరు నెలల్లో ట్విట్టర్ పూర్తిగా ఎలన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ లోపే ఈ డీల్ ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నాను అని ప్రకటించాడు. 5 శాతం కంటే తక్కువగా ఉన్న స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్‌ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాం అని ఎలన్‌ మస్క్‌ క్లారిటీ ఇచ్చాడు.

ఎలన్‌ మస్క్‌ చేసిన ఈ ప్రకటనతో ట్విటర్‌ షేర్లు పతనం అయ్యాయి. అయితే ఎలన్‌ మస్క్‌ చేసిన ఈ ట్వీట్ పై ట్విటర్‌ ఇంకా స్పందించలేదు. ఈ ట్వీట్ తో ప్రపంచ వ్యాపార సంస్థలు అన్ని ఆసక్తిగా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి