iDreamPost

ఎక్స్ యూజర్లకు మస్క్ షాక్.. దీన్ని వాడాలంటే ఆ పని చేయాల్సిందే?

ఎక్స్ యూజర్లకు మస్క్ షాక్.. దీన్ని వాడాలంటే ఆ పని చేయాల్సిందే?

ఎక్స్(ట్విట్టర్) అధినేత ఎలన్ మస్క్ యూజర్లకు మరో షాక్ ఇచ్చారు. ఎక్స్(ట్విట్టర్) వినియోగంలో మరిన్ని మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇకపై యూజర్లు దీనిని వినియోగించాలంటే ఆ పని చేయాల్సిందేనని అంటున్నారు. ట్విట్టర్ ను తన చేజిక్కించుకున్న తర్వాత ఎలన్ మస్క్ భారీ మార్పులకు తెరలేపిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లోగోను, పేరును మార్చి అందరికి షాకిచ్చాడు మస్క్. బ్లూటిక్ ఆప్షన్ ను కూడా తీసేసి, ఆ తర్వాత బ్లూ టిక్ పొందాలంటే యూజర్లు సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలని తెలిపాడు. తాజాగా మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలిపాడు. ఆ వివరాలు మీ కోసం..

ఎక్స్(ట్విట్టర్) ను ఉపయోగించాలంటే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సిందే అంటున్నాడు ఎలన్ మస్క్. త్వరలో యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపాడు. ఎక్స్ ఖాతా ఉన్న యూజర్లందరికీ ఇది వర్తిస్తుందని తెలిపాడు. అయితే ఈ ఛార్జీలను నెలవారిగా వసూలు చేయనున్నట్లు తెలిపాడు. ఎంత వసూలు చేస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఛార్జీల వసూలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో స్పష్టం చేయలేదు. వరల్డ్ వైడ్ గా ఎక్స్(ట్విట్టర్) యూజర్లు 550 మిలియన్ల మంది ఉన్నారని, కాగా ఇందులో ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో స్పష్టత లేదని అన్నాడు. ఈ క్రమంలోనే యూజర్ల నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నట్లు తెలిపాడు. ఈ అంశాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైన సందర్భంలో ఎలన్ మస్క్ వెల్లడించాడు. మరి మస్క్ తీసుకోనున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి