iDreamPost

హీరోను పెళ్లి చేసుకోనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య!

  • Author singhj Published - 04:49 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 04:49 PM, Fri - 28 July 23
హీరోను పెళ్లి చేసుకోనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య!

ఎలాన్ మస్క్.. ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఆయన పేరు ఎంతో గడించారు. అంతేకాదు పాపులర్ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ అయిన ట్విట్టర్​ను కొనుగోలు చేసి సంచలనం సృష్టించారాయన. అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు అధిపతి కూడా మస్కే కావడం విశేషం. కార్ల తయారీతో పాటు స్పేస్ ఎక్స్​ అనే సంస్థ ద్వారా ఏరోస్పేస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారాయన. వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఎలాన్ మస్క్.. వైవాహిక జీవితంలో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

వ్యాపార రంగంలో ఎలాన్ మస్క్ చూడని విజయం లేదు. అలాంటి ఈ అపర కుబేరుడు వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేదు. ఆయన మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాటిలో ఏ ఒక్క పెళ్లి​ కూడా నిలవలేదు. మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు భార్యలతోనూ ఆయన అధికారికంగా విడిపోయారు. ఆయన నుంచి విడాకులు తీసుకున్న వారిలో రెండో భార్య తలులా రిలే కూడా ఒకరు. ఆమెను మస్క్ రెండు సార్లు పెళ్లి చేసుకోవడం గమనార్హం. మస్క్-తలులా చాన్నాళ్ల కిందే విడిపోయారు. కాగా, ఆమెకు ఇప్పుడు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. బ్రిటిష్ స్టార్ నటుడు థామస్ బ్రాడీ సాంగ్​స్టర్​తో రెండేళ్లు డేటింగ్ చేసిన తలులా రిలే ఇటీవలే ఎంగేజ్​మెంట్ చేసుకున్నారు.

థామస్​ బ్రాడీతో తన ఎంగేజ్​మెంట్ అయిన తర్వాత తలులా రిలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. రెడ్ హార్ట్ ఎమోజీతో కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. థామస్ కూడా తమ నిశ్చితార్థం గురించి ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేశారు. అయితే వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడనేది ఇంకా తెలియరాలేదు. థామస్​-తలులా 2021లో డేటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే, తలులా రిలేతో రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత స్కాట్లాండ్​లోని డోర్నోచ్ కేథడ్రల్​లో మ్యారేజ్ చేసుకున్నారు ఎలాన్ మస్క్. అయితే 2016లో ఈ జంట డివోర్స్ తీసుకొని విడిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి