iDreamPost

ఓ ఇంటివాడు కాబోతున్న ఈ నగరానికి ఏమైంది హీరో! ఎంగేజ్ మెంట్ పిక్ వైరల్..

  • Author Soma Sekhar Published - 06:35 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 06:35 PM, Wed - 5 July 23
ఓ ఇంటివాడు కాబోతున్న ఈ నగరానికి ఏమైంది హీరో! ఎంగేజ్ మెంట్ పిక్ వైరల్..

ఈ నగరానికి ఏమైంది? బహుశా ఈ సినిమా చూడని వారు ఉండరు అనుకుంటా. ఇటీవలే 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఓ కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. అప్పట్లో యూత్ మెుత్తం ఈ సినిమాకు కనెక్ట్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానిల నటన నభుతో నఃభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. కాగా.. ఈ మూవీలో నటించిన సాయి సుశాంత్ రెడ్డి తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని ఎగేజ్ మెంట్ పిక్ వైరల్ గా మారింది.

సాయి సుశాంత్ రెడ్డి.. ఈ నగరానికి ఏమైంది? చిత్రంలో కార్తిక్ పాత్రలో జీవించాడు. ఈ ఒక్క చిత్రంలోని నటనతో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు సుశాంత్. ఈ మధ్యనే నాగచైతన్య నటించిన థ్యాంక్యూ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ క్రమంలోనే సాయి సుశాంత్ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో పంచుకున్నాడు సుశాంత్. తనకు కాబోయే అమ్మాయికి ఉంగరం తొడుగుతున్న పిక్ ను షేర్ చేశాడు. దానికి జతగా ఈ నగరానికి ఏమైంది? సినిమా డైలాగ్ ను కూడా జతచేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు, సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

 

$aiAnuMudhiraj (@saianuedits) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

 

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

 

Memes Theatre (@memes__theatre) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి