iDreamPost

30 నిమిషాల్లో మూడు సార్లు భూకంపం.. భయంతో జనం పరుగులు!

30 నిమిషాల్లో మూడు సార్లు భూకంపం.. భయంతో జనం పరుగులు!

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.  దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. వరద నీటితో నదుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడి.. లోపలే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇలాంటి ఈ సమయంలో రాజస్తాన్‌ ప్రజలకు కొత్త సమస్య వచ్చిపడింది.

వరుస భూకంపాలతో జైపూర్ ప్రజలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. 30 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున జైపూర్‌ ప్రజలను భూకంపం భయపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తెల్లవారుజామున 4:09 నిమిషాలకు వచ్చింది. అది రిక్టార్‌ స్కేల్ పై 4.4 గా నమోదయింది. రెండో భూకంపం 4:22 కి రాగా.. అది రిక్టార్‌ స్కేల్ పై 3.1 గా నమోదయింది. చివరిది 4. 25 నిమిషాలకు వచ్చింది. దాని తీవ్రత రిక్టార్‌ స్కేల్ పై 3 గా నమోదయింది.

ఇక, దీనిపై స్పందించిన నేషనల్ సెంటర్ అఫ్ సెస్మోలజీ.. భూకంపం 4:09 నిమిషాలకు 10 కిలోమీటర్ల లోతులో వచ్చిందని తెలిపింది. భూకంప తీవ్రత తక్కువగానే ఉండటంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు. ప్రజలెవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదు. భూకంపం వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో భూకంప తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. భూమి మొత్తం చిగురుటాకులా గజగజ ఒణికిపోయింది. మరి, రాజస్తాన్‌ను హడలెత్తించిన భూకంపాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి