iDreamPost

ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన జనం!

ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన జనం!

దేశంలో పలు చోట్ల వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. భూమి ఉన్నట్టుండి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్ లో ఆదివారం భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.1 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించారు. హరియానాలోని ఫరిదాబాద్ కి 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిందని అంటున్నారు.

భూకంప ప్రభావం వల్ల భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతమంది ఆఫీస్ లు ఖాళీ చేసి మరి రోడ్లపైకి వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు. భూకంప ప్రభావంత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెలలో 3వ తేదీన ఇలాగే భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి