iDreamPost

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతగా నమోదు!

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతగా నమోదు!

ఇటీవల ప్రపంచంలో వరుస భూకంపాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెలలో ఆఫ్ఘనిస్థాన్ లో మూడు సార్లు ఒకే చోట భూకంపం సంభవించింది. భారత్ లో సైతం ఢిల్లీ పరిసర ప్రాంతంలో రెండు సార్లు భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. భూమి కొద్దిక్షణాల పాటు కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఉత్తరాది రాష్ట్రాలను మరోసారి భూ ప్రకంపణలు వణికించాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. వివరాల్లోకి వెళితే..

దేశంలో పలు చోట్ల వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపణలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం లేకున్నా భూకంపం పేరు చెబితేనే భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లో స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ఉదయం 9.11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని దీని తీవ్రత 4.0 గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఫితోర్‌ఘర్ కు ఈశాన్యంగా దాదాపు 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. భూమి కంపించడంతో ప్రజలు భయపడిపోయారు.. ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు.

ఇటీవల ఢిల్లీ, పంజాబ్, హరియానా, యూపీ సహా ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్ లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదు అయ్యింది. హరియాణా లోని ఫరీదాబాద్ కు 13 కిలోమీటర్ల దూరంలో భూపంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇదే నెలలో ఆఫ్ఘనిస్థాన్ ని భూకంపాలు పట్టి వదలడం లేదు. వరుసగా మూడోసారి భూకంపం సంభవించడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని ఇక్కడ అధికారులు వెల్లడించారు. నిన్న కూడా మూడోసారి భూకంపం సంభవించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి