iDreamPost

ఈగల్ 3 డే కలెక్షన్స్.. ఎంత వసూలు చేసిందంటే..?

ఫిబ్రవరి 9న థియేటర్లలో సందడి చేసిన మూవీ ఈగల్. మాస్ మహారాజా మరోసారి ఊర మాస్ యాంగిల్లో కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరీ ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

ఫిబ్రవరి 9న థియేటర్లలో సందడి చేసిన మూవీ ఈగల్. మాస్ మహారాజా మరోసారి ఊర మాస్ యాంగిల్లో కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరీ ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

ఈగల్ 3 డే కలెక్షన్స్.. ఎంత వసూలు చేసిందంటే..?

సంక్రాంతి బరి నుండి తప్పుకుని.. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చేసింది మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగల్. సూర్య వర్సెస్ సూర్య దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. చాలా గ్యాప్ తర్వాత ఈగల్ మూవీతో మెగా ఫోన్ పట్టాడు. ధమాకా మూవీతో హిట్ అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి ఈ ఎనర్జీ స్టార్‌తో మరో మూవీని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్ ఈగల్ మూవీకి నిర్మాత. అనుప పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలక పాత్రలను పోషించారు. దేవ్ జాంద్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రీ బిజినెస్ రూ. 21 కోట్లు పలికింది. ఇదిలా ఉంటే ఈ మూడు రోజులకు గానూ ఈ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టిందంటే..?

సింగిల్ రిలీజ్ మూవీగా వచ్చిన ఈగల్.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిటిక్స్, ఆడియన్స్ మిక్స్‌డ్ రివ్యూస్ ఇచ్చారు. అయినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. మాస్ మహారాజాను ఊర మాస్ యాంగిల్ చూపించాడు దర్శకుడు.. కార్తీక్. ఈగల్ ఆదివారం కూడా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సండే నాడు ఒక్క రోజే ఇండియా వైడ్‌గా సుమారు రూ. 4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 29.60 కోట్లను కలెక్ట్ చేసింది. హిందీలో కూడా ఈ సినిమా పైసా వసూలు చేస్తోంది. మూడు రోజుల్లో రూ. 50 లక్షల నెట్ క్రాస్ చేసింది.

మొత్తంగా మూడు రోజుల్లో 14.70 కోట్ల షేర్ వచ్చింది ఈగల్ మూవీకి. మిక్స్ టాక్‌తో నడుస్తున్నా.. తన నటనతో కలెక్షన్లు వచ్చేలా చేసుకుంటున్నాడు రవితేజ. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా 50 శాతం కలెక్షన్లు రాబట్టకుందని టాక్ నడుస్తుంది. సినిమా నిలబడితే.. ఈ వారంలో బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇతర సినిమాలేవి పెద్ద పోటీగా లేవు కనుక.. కలెక్షన్లు రాబట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తన ఈజీ గోయింగ్ నటనతో మరోసారి మెస్మరైజ్ చేశాడు మాస్ మహారాజ్. ఫ్యాన్స్ అయితే రవిని ఈ మాస్ ఎలివేషన్లలో చూసుకుని సంబరపడిపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి