iDreamPost

మిచౌంగ్‌ తుఫాను ప్రభావం.. విశాఖ బీచ్ ఒడ్డుకు కొట్టుకొస్తున్న చేపలు

మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్ తో ఇప్పుడు చెన్నై, ఏపీ చిగురుటాకుల వణుకుతోంది. విశాఖ బీచ్ లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో అందులోని చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి.

మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్ తో ఇప్పుడు చెన్నై, ఏపీ చిగురుటాకుల వణుకుతోంది. విశాఖ బీచ్ లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో అందులోని చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి.

మిచౌంగ్‌ తుఫాను ప్రభావం.. విశాఖ బీచ్ ఒడ్డుకు కొట్టుకొస్తున్న చేపలు

మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో ఇప్పుడు చెన్నై, ఏపీ చిగురుటాకుల వణుకుతోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత రెండు రోజుల నుంచి విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించాయి. అయితే, ఈ వర్షానికి వాహన దారులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముందే అప్రమత్తమై తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఇంతే కాకుండా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఉంచారు. కాగా, మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్ తో ఏపీ, చెన్నై కాకుండా దీని ప్రభావం తెలంగాణపై కూడా పడింది. దీంతో సోమవారం రాత్రి నుంచి హైదారాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.

అయితే, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయానికి కూడా వర్షం తగ్గకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే… మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్ తో విశాఖ బీచ్ లో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. దీంతో అందులోని చేపలు భారీ ఎత్తున బీచ్ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఈ విషయం తెలుసుని స్థానిక ప్రజలు ఆ చేపలను పట్టుకునేందుకు బీచ్ వద్దకు పరుగులు తీశారు. చెన్నైలోని తీర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద పెద్ద చేపలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటిని చూసి వాహనదారుల కేరింతు కొడుతూ పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి