iDreamPost

ఏపీలో రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త.. వారి అకౌంట్‌లోకి డబ్బులు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు సుస్థిర పాలన అందిస్తున్నారు. అలానే తరచూ వివిధ వర్గాల వారికి గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా కూడా ఓ రంగానికి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు సుస్థిర పాలన అందిస్తున్నారు. అలానే తరచూ వివిధ వర్గాల వారికి గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా కూడా ఓ రంగానికి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఏపీలో రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త.. వారి అకౌంట్‌లోకి డబ్బులు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల్లో గుర్తింపు సంపాదించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్ జగన్ ఎన్నో స్కీమ్స్  ప్రవేశ పెట్టి..వారి ఇళ్లల్లో దేవుడిగా నిలిచారు. విద్య, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అలానే రైతులకు కూడా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ప్రకృతి విపత్తుల సమయంలో వారిని ఆదుకునేందుకు సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. ఇక తరచూ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ చెబుతుంటారు. తాజాగా కూడా ఓ విషయంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ  రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విపత్తుల నిర్వహణ,పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎస్.. అధికారులతో చర్చించారు. వేసవిలో తాగునీటి కోరత ఏర్పాడే గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే సందర్భంగా తుఫాన్ బాధిత రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. మిచౌంగ్‌ తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని సీఎస్ తెలిపారు.

అదే విధంగా ఇతర శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో తాగు నీటికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాస్తవానికి సంక్రాంతి లోగా రైతుల అకౌంట్లలోకి ఇన్ ఫుట్ సబ్సిడీ జమ చేస్తామని  జగన్ సర్కార్ తెలిపింది. కానీ, వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈనెలలో డబ్బుల్ని జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

గతేడాది వచ్చిన మిచౌంగ్ తుఫాన్.. రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రైతులకు కన్నీరు మిగిల్చిందనే చెప్పవచ్చు. ఈ తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అలానే పెద్ద సంఖ్యలో  ధాన్యం నీటి పాలైంది. ఆ సమయంలో నిరాశ్రయులుగా మారిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. అలానే తడిసిన ధాన్యాలను కొనుగోలు చేసింది. అదేవిధంగా తుఫాన్ బాధిత రైతుల అకౌంట్లలోకి ఇన్ ఫుట్ సబ్బిడీ జమ చేస్తామని జగన్ ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఈ విషయంపై సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి