iDreamPost

దుబ్బాకలో దూసుకెళుతున్న కమలం.. నాలుగో రౌండ్‌లోనూ ఆధిక్యం..

దుబ్బాకలో దూసుకెళుతున్న కమలం.. నాలుగో రౌండ్‌లోనూ ఆధిక్యం..

దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలం దూసుకెళుతోంది. ఓట్లు లెక్కింపు ప్రారంభం నుంచి ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. తాజాగా పూర్తయిన నాలుగో రౌండ్‌ ఓట్ల లెక్కింపులోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి బీజేపీ 2,684 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. రెండో స్థానంలో టీఆర్‌ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్‌ పార్టీలు నిలిచాయి. ఇంకా 19 రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో మాత్రమే టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరిచింది.

దుబ్బాకలో కమలం జోరు.. మూడో రౌండ్‌లోనూ ఆధిక్యం..

తెలంగాణ రాష్ట్రం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో కమలం పార్టీ జోరు కనిపిస్తోంది. 23 రౌండ్లకు గాను ఇప్పటి వరకూ మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మూడు రౌండ్లలోనూ కమలం పార్టీ ఆధిక్యం సాధించింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన మూడో రౌండ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 124 ఓట్ల ఆధిక్యం సంపాధించింది.

మొత్తం మీద మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌ రావుకు 9,223 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 7,964 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 1,931 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1,259 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. ఇంకా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపు ధీమాగా ఉన్నారు. ఈ నెల 3న జరిగిన ఎన్నికల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. 82.61 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి