iDreamPost

బ్రేకింగ్: DSC నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం!

AP DSC: జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలను వెల్లడించారు.

AP DSC: జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయాలను వెల్లడించారు.

బ్రేకింగ్: DSC నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం!

నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల జరిగిన ఏపీ మంత్రి మండలిలో ఆమోదించిన ప్రకారం డీఎస్సీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. మొత్తం 6,100 టీచర్ పోస్టుల భర్తీకీ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఈ డిఎస్సీ నోటిఫికేషన్ లో 2,280 ఎస్జీటీ, 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల12వ తేదీ నుంచి డీఎస్సీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్ లో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రైమరీ కీ విడుదల అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు కీపై అభ్యంతరాలు స్వీకరణ ఉంటుంది. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తారు. చివరగా ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.

అదే విధంగా ఈనెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు ఉంటాయి. రెండు సెషన్స్ లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రైమరీ కీ మార్చి10వ తేదీన విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాల స్వీకరణకు 11వ తేదీ దాకా గడువు ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13న విడుదల చేస్తారు. మార్చి 14వ తేదీన టెట్ తుది ఫలితాలు ప్రకటిస్తారు. వేరు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారికి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి