iDreamPost

Drushyam 2 : సురేష్ బాబు బిజినెస్ లెక్కలు వేరే

Drushyam 2 : సురేష్ బాబు బిజినెస్ లెక్కలు వేరే

వెంకటేష్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదని కోరుకున్నారో ఆ దృశ్యం 2 ఓటిటి రిలీజ్ అఫీషియల్ అయిపోయింది. నారప్ప తర్వాత తక్కువ గ్యాప్ లో దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25న ప్రీమియర్ కాబోతోంది. దీన్ని థియేటర్లలో చూడాలనుకున్న దగ్గుబాటి అభిమానులకు ఇది షాక్ కలిగించింది. ఈ సినిమా ఓటిటికేనని ముందు నుంచి ప్రచారం జరిగినప్పటికీ నిర్మాత సురేష్ బాబు మనసు మార్చుకుంటారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అయితే అది జరగలేదు. కట్ చేస్తే కేవలం రెండు వారాల ముందు ఇప్పుడు టీజర్ తో పాటు ప్రకటన ఇచ్చారు. విక్టరీ వెంకీని మరోసారి చిన్నితెరపై చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.

సురేష్ బాబు వ్యాపారపరంగా చాలా ప్రాక్టికల్ మనిషని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. నారప్ప టైంలో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దృశ్యం 2 ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రైమ్ ఇచ్చినంత మొత్తాన్ని షేర్ రూపంలో వసూలు చేయడం దాదాపు అసాధ్యమే. ఎంతలేదన్నా 30 నుంచి 38 కోట్ల మధ్య ఈ డీల్ జరిగింది. అదే కలెక్షన్ రూపంలో రావాలంటే 50 కోట్ల దాకా బాక్సాఫీస్ రాబట్టుకోవాలి. దృశ్యం 2కి ఎంత మంచి టాక్ వచ్చినా కూడా ఆ ఫిగర్ ని చేరుకోవడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. పైగా దృశ్యం 2 మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది కాదు. ఒక క్లీన్ ఫ్యామిలీ థ్రిల్లర్.

అసలే జనాల పల్స్ అంతు చిక్కడం లేదు. థియేటర్లకు వస్తున్నట్టు కనిపిస్తోంది కానీ వీక్ డేస్ లో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. గడిచిన నాలుగు నెలల్లో ఒక్క లవ్ స్టోరీ మాత్రమే 35 కోట్ల షేర్ ని అందుకుంది. నెక్స్ట్ చెప్పుకోదగ్గ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 25 కోట్ల దగ్గర ఆగిపోగా ఎస్ఆర్ కళ్యాణ మండపం 9 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. రాజరాజ చోర 8 కోట్లను టచ్ చేసింది. ఇవన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నవే. ఈ ట్రెండ్స్ ని విశ్లేషించే సురేష్ బాబు నిర్ణయాన్ని వెనక్కు తీసుకెందుకు ఇష్టపడలేదు. మరి విరాట పర్వం విషయంలోనూ ఇదే బాట పడతారా లేక దాన్నైనా సినిమా హాళ్లకు తెస్తారా చూడాలి. రెండో ఆప్షన్ కు అవకాశం తక్కువగానే అనిపిస్తోంది

Also Read : Narasimha : బుల్లితెరను షేక్ చేసిన నరసింహ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి