iDreamPost

వీడియో: మద్యం మత్తులో యువతుల హల్ చల్.. పోలీసులను బూతులు తిడుతూ!

వీడియో: మద్యం మత్తులో యువతుల హల్ చల్.. పోలీసులను బూతులు తిడుతూ!

‘మద్యం సేవిచడం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాంతంకం’ అని అందరికీ తెలుసు. ఏ సినిమాకి వెళ్లినా పెద్ద పెద్ద డిస్ క్లైమర్స్ తో ఆ విషయం చెబుతూ ఉంటారు. కానీ, దానిని చెవికి ఎక్కించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. వీకెండ్ రాగానే పబ్బులు, పార్టీలు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. అయితే మందేయడాన్ని ఎవరూ తప్పుబట్టటం లేదు. కానీ, ఆ తర్వాత వాళ్లు వేసే వేషాల గురించే అందరి బాధ. చాలా మంది అయితే అసలే కోతి.. ఆపై కల్లు తాగింది అన్న చందాన చేస్తుంటారు. ఆ వీడియోలు కాస్తా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

అలాగే ఇప్పుడు ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే అందులో మద్యం సేవించి నానా హంగామా చేసింది కుర్రాళ్లు కాదు. ముగ్గురు యువతులు మద్యం మత్తులో నానా యాగి చేశారు. నడిరోడ్డుపై ఆగమాగం చేస్తుంటే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా ఏకంగా పోలీసులపైనే రెచ్చిపోయారు. ఒక కానిస్టేబుల్ వీడియో తీస్తుంటే అతడిని నెట్టేసి ఫోన్ కింద పడేశారు. అక్కడితో ఆగకుండా పోలీసులను బూతులు తిడుతూ రోడ్డు మీద హంగామా సృష్టించారు.

ఈ తతంగం అంతా మన దగ్గర కాదులెండి.. ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువతులు రోడ్డు మీద సీన్ చేస్తుంటే.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. పోలీసులపై కూడా రెచ్చిపోయారు. ఆడవాళ్లతో మాట్లాడే తీరు ఇదేనా అంటూ ఓ యువతి రెచ్చిపోయింది. వాళ్లు కానిస్టేబుల్ ను నెట్టేస్తూ హల్ చల్ చేశారు. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. పోలీసులతో పాటు స్థానికులు కూడా కొందరు వీడియోలు తీశారు.

వారిపై కూడా యువతులు ఆగ్రహం వ్యక్యం చేసి.. ఫోన్లు లాగేసుకోబోయారు. తర్వాత మహిళా పోలీసులు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారికి కౌన్సింలింగ్ ఇచ్చి.. విడుదల చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయినా ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయిందిలే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పబ్ కల్చర్, మద్యం సేవించడాన్ని అంతా ప్యాషన్ అనుకుంటున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి