iDreamPost

క్లాస్ రూమ్‌కి పీకలదాకా తాగి వచ్చిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్

తల్లిదండ్రులకు పిల్లలకు జన్మనిస్తే.. సొసైటీలో వారికి ఉన్నతమైన స్థాయి చేరుకోవడానికి విద్యాబుద్దులు నేర్పించేది గురువులు. ఇటీవల గురువు స్థానానికి కొంతమంది కలంకం తెస్తున్నారు.

తల్లిదండ్రులకు పిల్లలకు జన్మనిస్తే.. సొసైటీలో వారికి ఉన్నతమైన స్థాయి చేరుకోవడానికి విద్యాబుద్దులు నేర్పించేది గురువులు. ఇటీవల గురువు స్థానానికి కొంతమంది కలంకం తెస్తున్నారు.

క్లాస్ రూమ్‌కి పీకలదాకా తాగి వచ్చిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్

గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. అని గురువును త్రిమూర్తులతో పోల్చుతుంటారు. జన్మనిచ్చేది తల్లిదండ్రులే అయినా.. సమాజంలో మనిషిని ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దేది గురువే.. అందుకే ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తుంటారు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువు వద్ద గడుపుతుంటారు. కానీ ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. వారిపై అత్యాచారాలకు పాల్పపడటం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు మద్యం సేవించి తరగతి గదికి వెళ్లి గుర్రు పెట్టి నిద్రపోవడం, విద్యార్థులపై దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ కి పీకలదాకా తాగి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే…

ఉత్తర్ ప్రదేశ్ లోని హమీమ్ పూర్ జిల్లాలో మద్యం మత్తులో స్కూల్ కి చేరుకున్న ఓ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు తరగతి గదిలో కుర్చీపై నిద్రమత్తులో పడి ఉండటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ కి తాగి వచ్చాడన్న విషయం గురించి స్థానికులు తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని లేపేందుకు ప్రయత్నించారు.. కానీ అప్పటికే ఆ ఉపాధ్యాయుడు పీకలదాకా తాగి ఉండటంతో కుర్చీ నుంచి లేవలేకపోయాడు. కుర్చిలో కూర్చున్న టీచర్ ని ఎన్నిసార్లు లేపేందుకు ప్రయత్నించినా.. లేచి మళ్లీ పడుకుంటున్నాడు. ఇది కాస్త స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. టీచర్ అపస్మారక స్థితి నుంచి మేల్కొన్న తర్వాత స్థానికులు అక్కడ నుంచి వెళ్లిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ… ఆ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ కి పీకలదాకా తాగి రావడం కొత్తేమీ కాదని.. పలుమార్లు హెచ్చరించినా అని తీరు మార్చుకోలేదని అంటున్నారు. పాఠశాలకు ఇలాంటి ఉపాధ్యాయులు రావడం వల్ల విద్యార్థులు ఏమీ నేర్చుకోలేకపోతున్నారని.. కొంతమంది విద్యార్థులు భయంతో క్లాస్ కి రాలేకపోతున్నారని వాపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్ ఏమైపోతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. తాగి వచ్చి విద్యార్థులకు ఏం బోధిస్తాడు.. వారు ఎలాం అభివృద్ది చెందుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా టీచర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నామని.. ఈ ఘటనపై విచారణ చేపడతామని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి అలోక్ సింగ్ అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి