iDreamPost

సోదరి వివాహానికి కానుక ఇస్తానన్నాడని.. భర్తను కొట్టి చంపిన భార్య

చెల్లెమ్మకు పెళ్లి అనగానే సంబరంలో మునిగిపోయాడు అన్నయ్య. ఆమెకు ఏమేమీ బహుమతులు ఇవ్వాలా అని ఆలోచన చేశాడు. చెల్లికి గిఫ్టులు తీసుకున్నాడు. ఈ విషయం అతడి భార్యకు తెలిసింది. అంతే.. గయ్యాళిలా మారి

చెల్లెమ్మకు పెళ్లి అనగానే సంబరంలో మునిగిపోయాడు అన్నయ్య. ఆమెకు ఏమేమీ బహుమతులు ఇవ్వాలా అని ఆలోచన చేశాడు. చెల్లికి గిఫ్టులు తీసుకున్నాడు. ఈ విషయం అతడి భార్యకు తెలిసింది. అంతే.. గయ్యాళిలా మారి

సోదరి వివాహానికి కానుక ఇస్తానన్నాడని.. భర్తను కొట్టి చంపిన భార్య

ఆడ పిల్లకు పెళ్లి అంటే తల్లిదండ్రులతో పాటు ఆమె సోదరుడు కూడా బాధ్యతను పంచుకుంటాడు. ఆమె అన్ననో లేక తమ్ముడో పెళ్లి పనులు భుజాన ఎత్తుకుంటాడు. పెళ్లి మండపం మాట్లాడటం దగ్గర నుండి పత్రికలు పంచడం, వివాహానికి వచ్చిన బంధువులను మర్యాదలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటాడు. పెళ్లిలో హంగామా, హడావుడి అంతా పెళ్లి కూతురి సోదరుడిదే. ఈ వివాహ తంతులో ఆల్మోస్ట్ ఓ పనోడిలా మారిపోతాడు. సోదరిని అత్తారింటి పంపేంత వరకు.. అలిసిపోకుండా పెళ్లి పనులన్నీ చక్కబెడుతుంటాడు. ఇక ఆ అన్నకు పెళ్లి అయితే.. సోదరికి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్టు ఇవ్వాలని తహతహలాడిపోతుంటాడు. ఇలా ఆలోచించే ఓ వ్యక్తి.. తన భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

సోదరి పెళ్లికి నిశ్చయం కావడంతో.. సంతోషంతో మునిగి తేలిన సోదరుడు.. ఆమెకు మంచి గిఫ్లులు ఇవ్వాలనుకున్నాడు. చెల్లికి బంగారపు ఉంగరం, ఎల్ఈడీ టీవీని బహుకరిద్దామని అనుకున్నాడు. ఈ విషయం అతడి భార్యకు తెలిసింది. ఈ విషయంపై భార్యా, భర్తల మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. తాను ఇచ్చి తీరేది ఖాయమని చెప్పడంతో.. తన సోదరులతో కలిసి.. భర్తను కొట్టి చంపింది ఆ మహా ఇల్లాలు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సహరీ మజ్రీ ఝరసవా గ్రామంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు చంద్ర ప్రకాశ్ మిశ్రా, చావి మిశ్రా.

ఈ నెల 26న సోదరి పూజా పెళ్లికావడంతో.. ఆమెకు ఉంగరం, ఎల్ఈడీ టీవీలను బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు అన్నయ్య చంద్ర మిశ్రా. ఈ విషయం నచ్చని భార్య చావి.. భర్తతో గొడవ పడింది. ఈ నేపథ్యంలో తన సోదరుడు, ఇతర బంధువులను కదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మిశ్రాపై కర్రలతో దాడి చేశారు చావి, ఆమె తరుఫు బంధువులు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో మరణించాడు. కాగా, చంద్ర ప్రకాశ్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో భార్య, ఆమె సోదరులు, మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి