iDreamPost

100 కోట్లు దాటేసిన బాలీవుడ్ దృశ్యం 2

100 కోట్లు దాటేసిన బాలీవుడ్ దృశ్యం 2

గత శుక్రవారం 18న మంచి అంచనాల మధ్య బాలీవుడ్ దృశ్యం 2 విడుదలైన దృశ్యం 2 హిట్టు కొట్టేసింది. మలయాళం, తెలుగుతో పోలిస్తే చాలా ఆలస్యంగా నిర్మాణం జరుపుకున్న ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మెప్పు పొందింది. బ్రహ్మాస్త్ర తర్వాత సరైన హిట్ లేక డల్ గా ఉన్న నార్త్ బాక్సాఫీస్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మంచి అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదలైన ట్రెండ్ పాజిటివ్ రివ్యూలు, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా తెచ్చుకోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెంచుకుంటోంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో మొదటి వీకెండ్ మల్టీప్లెక్సుల్లో స్పెషల్ షోలు వేశారంటే అక్కడి ప్రేక్షకులు ఈ సీక్వెల్ కి బాగా కనెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతోంది.

ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే దర్శకుడు అభిషేక్ పాఠక్ కొన్ని కీలక మార్పులతో సోల్ ని మిస్ చేయకుండా దీన్ని తీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మోహన్ లాల్, వెంకీలకు వచ్చిన లెన్త్ సమస్య రాకుండా జాగ్రత్త పడ్డాడు. 2 గంటల 12 నిమిషాలకే కట్ చేయడంతో వేగం పెరిగి మరీ బోర్ కొట్టకుండా సాగింది. పోలికల విషయానికి వస్తే పై రెండు చూసినవాళ్లకు ఈ అజయ్ దేవగన్ డ్రామా పెద్దగా థ్రిల్ ఇవ్వదు. కాకపోతే టబు, అక్షయ్ ఖన్నాల టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ మంచి అవుట్ ఫుట్ రావడానికి దోహదపడింది. కంపేర్ చేసినా సరే తన మీద నెగటివ్ కామెంట్స్ రాకుండా అజయ్ దేవగన్ చాలా సెటిల్డ్ గా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ బిజిఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మొత్తంగా చెప్పాలంటే హిందీ దృశ్యం 2 సక్సెస్ అయ్యింది. ఓటిటిలో రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రీమేక్ కి ఇంత స్పందన రావడం విశేషమే. శ్రేయా ఖాతాలో మరో విజయం. కాకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికీ దీన్ని చూసేశారు కాబట్టి అంతగా కలెక్షన్లు ఉండకపోవచ్చు కానీ పది రోజులకే ఇండియా వైడ్ దృశ్యం 2 మూడు వేల స్క్రీన్ల నుంచి 100 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ టాక్. అజయ్ గత రికార్డు తానాజీని ఈజీగా ఫైనల్ రన్ దాటేస్తుందని అంచనా. ఇంకో రెండు వారాలు పోటీ లేదు కాబట్టి ట్రెండ్ ఇంకా బాగుంటుందని పంపిణీదారులు అంచనా వేస్తున్నారు. అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ ల వల్ల కానిది అజయ్ చేసి చూపించాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి