iDreamPost

ఆఫీస్‌ పనులకు యాపిల్‌ ఫోన్‌ వాడొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు!

ఆఫీస్‌ పనులకు యాపిల్‌ ఫోన్‌ వాడొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు!

ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐఫోన్‌ కొనడానికి కిడ్నీలు అమ్ముకున్నవారు కూడా ఉన్నారు. ఐఫోన్‌ వాడటాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. బయటి వస్తువులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని చైనాలోనూ ఐఫోన్లకు పిచ్చపాటి డిమాండ్‌ ఉంది. అయితే, ఐఫోన్‌ వాడే వారికి చైనా ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఆఫీస్‌ పనులకు యాపిల్‌ ఫోన్లతో సహా ఏ ఇతర దేశానికి చెందిన ఫోన్లను వాడొద్దంటూ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఎందుకంటే.. వేరే దేశాల ఫోన్ల కారణంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు లీక్‌ అయ్యే అవకాశం ఉందని చైనా భావిస్తోంది. సాధారణంగా చైనా ఫోన్ల కారణంగా తమ దేశ భద్రతకు ఇబ్బందులు వస్తాయని మిగిలిన దేశాలు భయపడుతుంటాయి. అమెరికా, భారత్‌లు కూడా భద్రతా కారణాల వల్లే కొన్ని చైనా ఉత్పత్తులను, యాప్‌లను నిషేధించాయి. ఇప్పుడు చైనా ఇతర దేశాలను చూసి భయపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీస్‌ పని కోసం యాపిల్‌ ఫోన్లతో సహా ఏ ఇతర దేశానికి చెందిన ఫోన్లను వాడొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.

వాటిని ఆఫీస్‌లకు కూడా తీసుకురావద్దని హెచ్చరించినట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. కొన్ని రోజుల క్రితం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ మేరకు నోటీసులు కూడా వెల్లినట్లు సమాచారం. అయితే, చైనాలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించి తీరాల్సిందే. లేదంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మరి, తమ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు యాపిల్‌ ఫోన్లతో సహా.. ఏ ఇతర దేశాల ఫోన్లు వాడొద్దని ఆదేశాలు జారీ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి