iDreamPost

OTT Suggestion: ఎన్ని రోజులు సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తారు! ఈరోజే OTTలోకి వచ్చిన డాక్యుమెంటరీ మిస్ కావద్దు!

  • Published Apr 26, 2024 | 6:00 PMUpdated Apr 26, 2024 | 6:00 PM

ఓటీటీ లోకి ఈ వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేశాయి. అయితే, వీటిలో తెలుగులో ఉండే సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉంటారు. కానీ ఈ వారం ఓటీటీ లోకి వచ్చిన ఈ హాలీవుడ్ బయోపిక్ సిరీస్ ను మాత్రం అసలు మిస్ కాకండి.

ఓటీటీ లోకి ఈ వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేశాయి. అయితే, వీటిలో తెలుగులో ఉండే సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉంటారు. కానీ ఈ వారం ఓటీటీ లోకి వచ్చిన ఈ హాలీవుడ్ బయోపిక్ సిరీస్ ను మాత్రం అసలు మిస్ కాకండి.

  • Published Apr 26, 2024 | 6:00 PMUpdated Apr 26, 2024 | 6:00 PM
OTT Suggestion: ఎన్ని రోజులు సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తారు! ఈరోజే OTTలోకి వచ్చిన డాక్యుమెంటరీ మిస్ కావద్దు!

ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. వీటిలో ఉండే తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, తెలుగు కాకుండా ఇతర భాషల సినిమాలు, సిరీస్ లు గురించి చూసేద్దాం. ఎలాగూ తెలుగులో లేవు కదా ఇంకెందుకులే చూడడం అని లైట్ తీసుకుంటే మాత్రం కొన్ని మంచి సిరీస్ లను, సినిమాలను మిస్ అయినట్లే. భాష అనే కంచెను దాటేస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు మీ సొంతం అయిపోతాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ అయితే.. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కించింది. మరి ఇంతకీ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఎందుకు ఆ సిరీస్ వర్త్ వాచింగ్ అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు ” థ్యాంక్యూ.. గుడ్ నెట్ ది బోన్ జోవి స్టోరీ”. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ.. బోన్ జోవి అనే ఒక ఐకానిక్ మ్యూజిక్ బ్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంటరీనే ఈ సిరీస్. ఈ సిరీస్ లో ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇప్పటికైతే ఈ సిరీస్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ ఏ కాబట్టి పెద్దగా ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదనే చెప్పాలి. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సిరీస్ 7.7 రేటింగ్ దక్కించుకుంది. మరి ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి. ఎందుకు ఈ సిరీస్ వర్త్ వాచింగ్ అనే విషయానికొస్తే.. ఇది 1980 నుండి ఇప్పటి వరకు అమెరికన్ బ్యాండ్ యొక్క జర్నీ ఎలా సాగింది అనే విషయాలన్నింటిని.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్లకు ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి తీరాలి.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను డాక్యుమెంటరీ రూపంలోనో.. వెబ్ సిరీస్ లేదా మూవీ రూపంలోనో.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా.. ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలను.. వీటి ద్వారా తెలియజేస్తున్నారు మేకర్స్. మిగతా జోనర్ సినిమాలు, సిరీస్ లు అన్నీ ఓ ఎత్తైతే.. ఇటువంటి రియల్ లైఫ్ డాక్యుమెంటరీస్ మరొక ఎత్తు అనే విధంగా.. ప్రేక్షకుల మధ్యన ఇవి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక థ్యాంక్యూ.. గుడ్ నెట్ ది బోన్ జోవి స్టోరీ మొదటి సీజన్ మొత్తం నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఓటీటీ మూవీ లవర్స్ అంతా కూడా.. ఈ సిరీస్ కు ఒక ట్రై ఇవ్వొచ్చు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి