iDreamPost

OTT Suggestion: ఇండియా తొలి మహిళా పైలెట్‌ కథ సినిమాగా! OTTలో ఉంది చూశారా?

  • Published Apr 25, 2024 | 4:54 PMUpdated Apr 26, 2024 | 6:15 PM

ఓటీటీ లో ఉండే అన్ని ఫిలిమ్స్ అందరిని అఆకట్టుకున్నా కానీ.. కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ మాత్రం కొంతమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఒకవేళ మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా ఉందేమో చెక్ చేసేయండి.

ఓటీటీ లో ఉండే అన్ని ఫిలిమ్స్ అందరిని అఆకట్టుకున్నా కానీ.. కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ మాత్రం కొంతమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఒకవేళ మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా ఉందేమో చెక్ చేసేయండి.

  • Published Apr 25, 2024 | 4:54 PMUpdated Apr 26, 2024 | 6:15 PM
OTT Suggestion: ఇండియా తొలి మహిళా పైలెట్‌ కథ సినిమాగా! OTTలో ఉంది చూశారా?

హర్రర్, కామెడీ, ఫ్యామిలి ఎంటెర్టైనెర్స్, యాక్షన్ మూవీస్ అన్నీ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. కానీ, కొన్ని మూవీస్ మాత్రం కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తీసుకుని.. చిత్రీకరిస్తూ ఉంటారు. ఇవి ఎంతో మంది జీవితాలకు మార్గాన్ని చూపించే విధంగా కూడా ఉంటాయి. ఇలాంటి సినిమాలను చూసి ఇన్స్పిర్ అయినా వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఈ జోనర్ లో వచ్చాయి. ఒక వేళ ఇప్పుడు చెప్పుకోబోయే ఒక రియల్ లైఫ్ స్టోరీకి సంబంధించిన సినిమాను మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను మిస్ అయినట్లే. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటివరకు చెప్పుకున్న సినిమా పేరు “గుంజాన్ సక్సేనా”. ఈ సినిమా గురించి దాదాపు అందరు వినే ఉంటారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఒక గొప్ప అమ్మాయి కథ. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ లో నటించింది. భారతీయ వైమానిక దళంలో తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా .. జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కార్గిల్ లో ఆమె చూపిన ధైర్య సాహసాలను.. ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఇటువంటి ఓ గొప్ప సినిమాను అందరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి అనే విషయానికొస్తే..

ఈ సినిమా కథేంటంటే.. గుంజన్ సక్సేనా కు చిన్నప్పటినుంచి కూడా పైలెట్ కావాలనే కోరిక ఉండేది. ఆమె వయస్సుతో పాటు ఆమె మనసులో ఉన్న ఆ కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. అటు ఇంట్లోనూ ఇటు బయట సమాజంలోనూ ఎన్నో సమస్యలను వచ్చినా కూడా.. వాటి అన్నిట్నీని ఆమె ఎదుర్కొని.. వాటితో పోరాడి చివరికి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ లో పైలెట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఆమె జీవితంలో.. తొలి మహిళా పైలెట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి! తన సమస్యలను ఎలా పరిష్కరించుకుంది! మహిళా అనే కారణంగా తనను చిన్న చూపు చూసిన వారికీ ఎలాంటి సమాధానం ఇచ్చింది ! ముఖ్యంగా కార్గిల్ వార్ లో ఎలాంటి ధైర్య సాహసాలను చూపించింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఎంతో మందికి ఈ సినిమా ఒక మంచి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి