iDreamPost

OTT Suggestion: సైకో కి*ల్లర్ తో ఒక భర్త యుద్ధం.. OTTలో ఉన్న బెస్ట్ రివేంజ్ డ్రామా!

  • Published Apr 25, 2024 | 9:04 PMUpdated Apr 26, 2024 | 2:12 PM

థ్రిల్లర్ సినిమాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందా అనే ట్విస్ట్స్ తో ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగే కథానాలంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. ఈ క్రమంలో ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూడాల్సిందే.

థ్రిల్లర్ సినిమాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందా అనే ట్విస్ట్స్ తో ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగే కథానాలంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. ఈ క్రమంలో ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూడాల్సిందే.

  • Published Apr 25, 2024 | 9:04 PMUpdated Apr 26, 2024 | 2:12 PM
OTT Suggestion: సైకో కి*ల్లర్ తో ఒక భర్త యుద్ధం.. OTTలో ఉన్న బెస్ట్ రివేంజ్ డ్రామా!

ఈ మధ్య అందరు కే- డ్రామా సినిమాలను, సిరీస్ లను చూసేందుకు ఇష్టపడుతున్నారు. పైగా థ్రిల్లర్ సినిమాలను చూడాలంటే ముందుగా కొరియన్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న స్టోరీ లైన్ తో తెరకెక్కినా కానీ.. దానిని ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులకు నచ్చేలా మార్చగలిగేది మాత్రం కేవలం కొరియన్ వారు మాత్రమే. ఈ ప్లాట్ లో వచ్చిన ఈ కొరియన్ డ్రామా ను మిస్ చేస్తే మాత్రం.. ఒక మంచి థ్రిల్లర్ సినిమాను మిస్ చేసినట్లే. వైలెన్స్, థ్రిల్లర్ , మర్డర్ ఈ జోనర్ మూవీస్ చూసేవాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. పైగా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి ఇంతకీ ఈ సినిమా పేరేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటివరకు చెప్పుకున్న ఈ కొరియన్ సినిమా పేరు “ఐ సా ది డెవిల్”. ఈ సినిమాకు కిమ్ యీ వూన్ దర్శకత్వం వహించాడు. బ్లడ్ చూసి భయపడే వారు ఈ సినిమాను చూడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈ సినిమాలో చూపించే ప్రతి సీన్ కూడా అంత రియలిస్టిక్ గా ఉంటుంది. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి. ఈ సినిమా కథేంటంటే.. యూ యోన్ అనే మహిళ తన కార్ ఆగిపోవడంతో ఒక అడవిలో తన భర్త కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో అక్కడకి ఒక బస్ ను డ్రైవ్ చేసుకుంటూ ఒక అతను వస్తాడు. ఆమెను సాయం కావాలా అని అడిగితే.. ఆమె తన భర్త వస్తాడు అని చెప్తుంది. కానీ అతను మాత్రం అక్కడే ఉంటాడు. కొద్దీ సేపటికి ఆమెను కిడ్నప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. దీనితో అతను ఒక సైకో కిల్లర్ అని పోలీసులు గుర్తిస్తారు.

ఇక ఆ తర్వాత ఎలాగైనా అతనిని పట్టుకోవాలని ఆ మహిళా భర్త నిర్ణయించుకుంటాడు. దీనితో అతనిని ఫాలో అవ్వడం.. అతను ఎక్కడికి వెళ్తున్నాడు .. ఎవరితో మాట్లాడుతున్నాడు అనే ప్రతి విషయాన్నీ ఆ కిల్లర్ కు తెలియకుండా ట్రాక్ చేస్తుంటాడు. అలా అతనిని ఫాలో అవ్వడం అతనిని చంపకుండా కొట్టి వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. దీనితో ఆ కిల్లర్ ఇతనిని గుర్తించి ఇతని కుటుంబ సభ్యులను దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ! హీరో అతనిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ! అసలు ఇందులో డెవిల్ ఎవరు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కొరియన్ లాంగ్వేజ్ లోనే కాకుండా.. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి