iDreamPost

గర్భంతో ఉన్నవారు జాగ్రత్త.. ఈ పనులు చేయకూడదు.. ఇవి తినకూడదు..

గర్భంతో ఉన్నవారు జాగ్రత్త.. ఈ పనులు చేయకూడదు.. ఇవి తినకూడదు..

గర్భవతులుగా ఉన్నపుడు మహిళలు రోజూ చేసుకునే పనులలో కొన్నింటిని చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దలు కూడా గర్భంతో ఉన్న మహిళలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. గర్భంతో ఉన్న మహిళలు ఈ పనులు చేయకండి..

*బట్టలు ఉతకడం – ఎందుకంటే నీటిలో జారితే చాలా ప్రమాదకరం మరియు వంగి బట్టలు జాడించడం చేయకూడదు.
*ఇంటిని శుభ్రం చేయడం – దీని వలన హానికర ఆసిడ్ వాసనలు పీల్చడం మంచిది కాదు కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు.
*బరువు ఎక్కువగా ఉన్న వస్తువులను మోయకూడదు.
*మెట్లు, నిచ్చెనలు ఎక్కకూడదు.
*హై హీల్స్ చెప్పులు వేసుకోకూడదు.
*మిషన్ కుట్టకూడదు.
*ఇంటిలో ఉండేవారైనా, ఆఫీసులో వర్క్ చేసే వారైనా ఎక్కువసేపు కూర్చోకూడదు అలా కూర్చుంటే కాళ్ళు వాపులు వస్తాయి.
*గర్భవతులు ఎవరైనా ఏదైనా ట్యాబ్లేట్ వేసుకోవాలంటే డాక్టర్ను సంప్రదించి వేసుకోవాలి.

అలాగే గర్భంతో ఉన్నప్పుడు కొన్ని పదార్థాలు తినకూడదని మన పెద్దలు, డాక్టర్లు చెప్తారు.

*మసాలాలు, మషాలా పదార్థాలు తినకూడదు.
*ఫైనాపిల్, బొప్పాయి తినకూడదు.
*షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకూడదు.
*నువ్వులు తినకూడదు.

చాలా మంది గర్భవతులు వాంతులు ఎక్కువగా అవుతున్నాయని తినడం మానేస్తుంటారు కానీ అలా చేయకూడదు, మనకు నోరు చేదుగా ఉన్నా, వికారంగా అనిపించినా కూడా కచ్చితంగా మంచి ఆహరం తినాలి లేకపోతే శిశువుకు పోషకాలు అందవు. అలాగే గర్భంతో ఉన్నవాళ్లు ఏ పని చేసినా గంట తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కూర్చునేటపుడు నడుముకి సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. పైన తెలిపినవి పాటిస్తే గర్భంతో ఉన్నవారికి మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి