iDreamPost

దిగి వచ్చిన డాక్టర్ సుధాకర్, తనకు అలాంటి ఉద్దేశాలు లేవని వెల్లడి..

దిగి వచ్చిన డాక్టర్ సుధాకర్, తనకు అలాంటి ఉద్దేశాలు లేవని వెల్లడి..

డాక్టర్ సుధాకర్.. ఈ మత్తు డాక్టర్ విషయం చాలామందికి తెలిసిందే. కరోనా సమస్య తీవ్రంగా సమయంలో ఆయన సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. నర్సీపట్నం ఆస్పత్రి సమావేశంలో మాస్కుల పేరుతో ఆయన నడిపిన హైడ్రామా తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత వ్యవహరం విశాఖ నగరంలోని అక్కయ్య పాలెం జంక్షన్ కి చేరంది. అక్కడ కూడా మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి యత్నం, సీఎం మీద అవాకులు వంటివి జాతీయ మీడియాలో కూడా కలకలం రేపాయి. చివరకు సీబీఐ విచారణకు స్వీకరించాల్సి వచ్చింది.

అంతా జరిగిన తర్వాత ఆయన మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో మళ్లీ ఆయన సాధారణ స్థితికి వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రభుత్వ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. విధి నిర్వహణలో నిబంధనలు అతిక్రమించిన ఆయన శాఖపరమైన చర్యలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ కమిటీ ముందుకి వచ్చారు. ఆ సందర్భంగా తన ప్రవర్తన మీద ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన వ్యవహారశైలి మీద దిగివచ్చిన నేపథ్యంలో ఆయనకు మళ్లీ విధుల నిర్వహణకు అవకాశం ఇచ్చేందుకు ఏమేరకు పరిణామాలు అనుకూలంగా ఉంటాయన్నది వేచి చూడాల్సి ఉంది.

తాజాగా డాక్టర్ సుధాకర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఆయన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన వారికి పెద్ద గుణపాఠంగా మారింది. ఎస్సీ డాక్టర్ ని వేధించారని, తగిన ఏర్పాట్లు చేయకుండా వైద్యుడి మీద నిందలు వేస్తున్నారని గతంలో ప్రచారం చేసిన వారందరికీ భిన్నంగా ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలున్నాయి. ప్రభుత్వం తీరు మీద తాను వ్యవహరించిన తీరు శృతిమించిందని ఆయనే అంగీకరించడం విశేషంగా మారింది. తాను సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని, కానీ తగిన ఏర్పాట్లు లేవని అభిప్రాయంతోనే అలా వ్యవహరించానని చెప్పారు. ప్రభుత్వం మీద గానీ, ఇతరుల మీద గానీ తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారశైలి చుట్టూ వివాదం రాజేసిన వారికి తాజా ప్రకటనలు విశేషంగా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి