iDreamPost

పన్నీర్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

పన్నీర్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

పన్నీర్ అనేది అందరికి ఇష్టమైన ఒక పాలతో తయారైన పదార్థం. పన్నీర్ తో మనం పనీర్ కుర్మా, పనీర్ మసాలా కర్రీ, పనీర్ టిక్కా, పనీర్ బట్టర్ మసాలా… ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. పాలను మరగబెట్టినపుడు, కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలిపితే అపుడు పాలు ఉండలు ఉండలుగా మారి పనీర్ తయారు అవుతుంది. పన్నీర్ ని అందరూ ఇష్టంగా తింటారు. పన్నీర్ లో కాల్షియమ్, విటమిన్D, విటమిన్ B12 మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

పన్నీర్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు:-
*ఆడవారిలో ఎక్కువ మందికి వచ్చే రొమ్ము కాన్సర్ నుండి పన్నీర్ కాపాడుతుంది.
*పన్నీర్ రోజూ తింటే దీని వల్ల లభించే 5 % కాల్షియమ్ పిల్లలు, పెద్దలలో ఎముకలు గట్టి పడేలా చేస్తుంది.
*గర్భవతులకు కూడా మంచి ఆహరం పన్నీర్.
*పన్నీర్ లో లభించే ప్రోటీన్ అథ్లెటిక్స్, బాడీ బిల్డర్స్, మహిళలకు, ఆటలు ఆడేవారికి చాలా ముఖ్యమైన ఆహరం.
*రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి, ఒడ్డితిని తగ్గించడానికి పన్నీర్ ఉపయోగపడుతుంది.
*పిల్లల్లో ఆకలిని పెంచడానికి కూడా సహకరిస్తుంది.
*పన్నీర్ రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*పన్నీర్ లో ఉండే సెలీనియం మన శరీరం లోనికి విష వ్యర్ధాలు రాకుండా అడ్డుకుంటాయి.
*పన్నీర్ మధుమేహం కూడా అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి