iDreamPost

మ్యాజిక్ ఫిగర్ దాటిన సీట్లు.. సీఎం రేసులో యువరాణి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే తర్వాత సీఎం ఎవరు అనే చర్చ సాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే తర్వాత సీఎం ఎవరు అనే చర్చ సాగుతోంది.

మ్యాజిక్ ఫిగర్ దాటిన సీట్లు.. సీఎం రేసులో యువరాణి?

ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ను ఏ మాత్రం తీసిపోకుండా ఈ రోజు అవే ఫలితాలు వెలువడి కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. పార్టీలోని కీలక నేతలతో పాటు కొత్తగా పోటీ చేసిన కొందరు అభ్యర్ధులు కూడా గెలుపొందారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి కావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ తన రాజీనామా లేఖను సైతం గవర్నర్ తమిళిసైకి పంపించారు. ఆ లేఖను గవర్నర్ ఆమోదిస్తూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.

ఈ సమయంలో ఇప్పుడు అందరి నోటా ఒకటే మాటా.. నెక్ష్ట్ తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు. ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. ఇదిలా ఉంటే..ఈ రోజు వెలువడిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లు కూడా సాధించింది. అయితే, ఇప్పుడు రాజస్థాన్ లో సీఎం ఎవరు అనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వసుంధర రాజేతో పాటుగా జైపూర్ కుటుంబానికి చెందిన దియా కుమారి పేరు వినిపిస్తోంది. ఈమెను సీఎంగా ప్రకటించాలని కోరుతున్నారు. మరీ బీజేపీ అధిష్టానం యువరాణి దియా కుమారినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేక మరో వ్యక్తికి ఛాయిస్ ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి