iDreamPost

ఎక్కువైన గుంటూరు కారం ఘాటు! మహేశ్ కి తప్పని రిస్క్!

త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న లెక్కలు చూస్తే మహేశ్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.

త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న లెక్కలు చూస్తే మహేశ్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.

ఎక్కువైన గుంటూరు కారం ఘాటు! మహేశ్ కి తప్పని రిస్క్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల్లో మహేశ్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. వరుస ప్రాజెక్టులతో ఫ్యాన్స్ ఎప్పుడూ ఖుషీగా ఉంచే మహేశ్ ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై టాలీవుడ్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి ఇప్పటికే చాలా మంది టెక్నీషియన్స్ మారారు. అయినా కూడా గుంటూరుకారం ఘాటు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ సంక్రాత్రికి ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా రాజమౌళి ప్రాజెక్టు తర్వాత రావాల్సింది. కానీ, మహేశ్ మాత్రం ఈ మూవీ చేసిన తర్వాతే ఆ ప్రాజెక్టుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ ఈ మూవీనీ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంత్రికి థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ధమ్ కా మసాలా అంటూ తమన్ మ్యూజికల్ సాంగ్ ని విడుదల చేశారు. అంతేకాకుండా ఈ మూవీకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి భారీగానే ఆఫర్స్ వస్తున్నాయంట. ఆంధ్రా రైట్స్ రూ.50 కోట్లు, నైజాం రైట్స్ 45 కోట్లు ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే సీడెడ్ రైట్స్ రూ.25 కోట్లకు పలికే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మేర బిజినెస్ చేసే అవకాశం ఉంది.

ఈ డీల్స్ గనుక ఇలాగే సెట్ అయితే మహేశ్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ రికార్డ్ అవుతుంది. అయితే చాలా మంది ఈ లెక్కలు చూసి మహేశ్ రిస్క్ తీసుకుంటున్నాడు అంటున్నారు. అయితే మహేశ్ రేంజ్ అది. మార్కెట్ ఉంది కాబట్టి రిస్క్ చేయాలి. అంత మార్కెట్ దాటి.. మంచి ప్రాఫిట్స్ రావాలంటే కంటెంట్ అదిరిపోవాలి. దీని కోసం టీమ్ బాగా కష్టపడుతోంది. మాటల మాంత్రికుడు, మహేశ్ కాంబోకి తగ్గ కథ, డైలాగ్స్ పడితే ఇప్పుడున్న మహేశ్ మార్కెట్ కి అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. పైగా ఈ సినిమా గనుక ఆ స్థాయిలో రాణిస్తే.. తర్వాత రాబోతున్న రాజమౌళి- మహేశ్ ప్రాజెక్టుకు బిజినెస్ అమాంతం పెరిగిపోతుంది. మరి.. గుంటూరు కారం రైట్స్ కి సంబంధించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి