iDreamPost

దిశా నిందితులకు రీ పోస్టుమార్టం పూర్తి

దిశా నిందితులకు రీ పోస్టుమార్టం పూర్తి

ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్త నేతృత్వంలో దిశా నిందితులకు గాంధీ ఆసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ భద్రత మధ్య మృత దేహాలను స్వస్థలాలకు తరలింపు ప్రక్రియను పోలీసులు చేపట్టారు. ఇప్పటికే గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.రెండు అంబులెన్సుల ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు. గ్రామాలకు మృతదేహాలు చేరుకున్న వెంటనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

పోస్టుమార్టం సందర్భంగా నిందితుల శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్లు ఉన్నాయో వైద్యులు గుర్తించారు. మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో 4 బుల్లెట్ గాయాలను గుర్తించారు. చెన్నకేశవులు శరీరంలో 3 బుల్లెట్లు, నవీన్ శరీరంలో 2 బుల్లెట్లు, శివ శరీరంలో ఒక బులెట్‌ను వైద్యులు గుర్తించారు.పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశామని, రిపోర్టులన్నీ రహస్యంగా ఉంచుతామని డాక్టర్‌ శ్రవణ్‌ పేర్కొన్నారు. సీడీ, పెన్‌డ్రైవ్‌ ద్వారా పోస్టుమార్టం రిపోర్టులు హైకోర్టుకు అందజేయనున్నట్లు డాక్టర్ శ్రవణ్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి