iDreamPost

డిస్కోరాజా టార్గెట్ పెద్దదే – ప్రీ బిజినెస్ ఫిగర్స్

డిస్కోరాజా టార్గెట్ పెద్దదే – ప్రీ బిజినెస్ ఫిగర్స్

మాస్ మహారాజా రవితేజ ఏడాది పైగా గ్యాప్ తో చేసిన డిస్కో రాజా 24వ తేదీ శుక్రవారం థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే టీజర్లు అంచనా పెంచేయగా తమన్ ఆల్బమ్ కూడా హైప్ కు కారణమయ్యింది. బిజినెస్ పరంగానూ డిస్కో రాజా పెద్ద టార్గెట్ తోనే బరిలోకి దిగనుంది. ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు సుమారు 22 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇందులో సింహ భాగం అంటే 19 కోట్ల దాకా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చిందట. ఓవర్సీస్ లో రవితేజకు అంతగా పట్టు లేకపోవడంతో పాటు మొన్న ఏడాది వచ్చిన మూడు డిజాస్టర్లు ప్రభావం చూపించినట్టుగా కనిపిస్తోంది. అందుకే అక్కడి ఫిగర్లు కాస్త తక్కువగానే ఉన్నాయి

విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కో రాజాలో ఇస్మార్ట్ శంకర్ భామ నభ నటేష్, ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించారు. టైం పీరియడ్ ని బేస్ చేసుకున్న సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన డిస్కో రాజా మీద ఇప్పటికే ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి సినిమాల సందడి తగ్గింది కాబట్టి టాక్ కనక పాజిటివ్ గా వస్తే డిస్కో రాజాకు అది పెద్ద ప్లస్ గా మారుతుంది. తమిళ వర్సటైల్ యాక్టర్ బాబీ సింహా విలన్ గా చేయడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. రవితేజ సైతం రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఇన్నేసి అంచనాలతో వస్తున్న డిస్కో రాజా ఏ మేరకు మెప్పించబోతోందో ఇంకొద్ది గంటల్లోనే తేలిపోనుంది

ఏరియా వారి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ఏరియా  బిజినెస్ 
నైజాం  6.00cr
సీడెడ్   2.70cr
ఉత్తరాంధ్ర  1.90cr
గుంటూరు   1.50cr
క్రిష్ణ   1.30cr
ఈస్ట్ గోదావరి  1.30cr
వెస్ట్ గోదావరి  1.05cr
నెల్లూరు    0.75cr
ఆంధ్ర + తెలంగాణా  19.50cr
కర్ణాటక  + రెస్ట్ అఫ్ ఇండియా 1.40cr
ఓవర్సీస్   1.50cr
ప్రపంచవ్యాప్తంగా   22.40cr

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి