iDreamPost

తెరపైకి ఇళయరాజా బయోపిక్.. హీరో అతడేనా?

  • Author Soma Sekhar Published - 09:32 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 09:32 PM, Thu - 3 August 23
తెరపైకి ఇళయరాజా బయోపిక్.. హీరో అతడేనా?

వెండితెరపైకి ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలు వచ్చాయి. క్రీడలు, రాజకీయాలు, శాస్త్రవేత్తలు ఆఖరికి హీరోల జీవిత చరిత్రలు కూడా వెండితెరపై ఆవిషృతమైయ్యాయి. తాజాగా మరో బయోపిక్ వెండితెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి డైరెక్టర్ గా బాల్కీ వ్యవహరించనుండగా.. ఇళయరాజా పాత్రలో నటించనున్నాడట కోలీవుడ్ స్టార్ హీరో. ఈ బయోపిక్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇళయరాజా.. సంగీత ప్రపంచానికి ఈ పేరు ఒక బ్రాండ్. దాదాపు 1400 చిత్రాలకు సంగీత అందించిన ఘనత ఇళయరాజా సొంతం. మ్యూజిక్ మ్యాస్ట్రోగా తన సంగీతంతో ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా ఓలలాడిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను సినిమాగా తీయ్యాలన్న ఆలోచన వచ్చింది డైరెక్టర్ బాల్కీకి. అయితే ఇళయరాజా పాత్రను ఎవరు చేస్తారు? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ మ్యాస్ట్రో పాత్రను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేయాలని డైరెక్టర్ బాల్కీ ఆశపడుతున్నాడట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బాల్కీ. ఇక ఇళయరాజా లాగే ధనుష్ కూడా మంచి సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం మనందరికి తెలిసిందే. కాగా.. ఇళయరాజా బయోపిక్ లో నటించేందుకు ధనుష్ కూడా ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ప్రేమ పెళ్లి.. ఏడాదికే భర్తను కోల్పోయిన సీరియల్ నటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి