iDreamPost

కెరీర్ లోనే వింత మ్యాచ్ ఇది…? కోహ్లీని ఆ ఇద్దరూ మోసం చేసారా…?

కెరీర్ లోనే వింత మ్యాచ్ ఇది…? కోహ్లీని ఆ ఇద్దరూ మోసం చేసారా…?

వ్యక్తిపరంగా ఏమో గాని క్రికెట్ పరంగా వస్తే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా హుషారుగా ఉంటాడు. మైదానంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూ అయ్యే వరకు కోహ్లీ చాలా హుషారుగా ఉంటాడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కోహ్లీ హుషారు చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అతను సెంచరీ చేసినా టీంలో ఎవరు సెంచరీ చేసినా సరే తన సంతోషంగా భావిస్తూ ఉంటాడు ఈ రన్ మెషీన్.

అలాంటి కోహ్లీ… గురువారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కాస్త కంగారు కంగారుగా కనిపించాడు అంటున్నారు అతని ఫాన్స్. ఏంటీ అసలు మేటర్ అంటే… టాస్ గెలిచిన విషయం కూడా కోహ్లీ పట్టించుకోలేదు. వాస్తవానికి టాస్ గెలిచిన వాళ్ళు మైక్ లో మాట్లాడుతూ ఉంటారు. కాని కోహ్లీ టాస్ గెలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్సన్ పిలిచి మైక్ ఇచ్చాడు. అలా కోహ్లీ వెళ్ళిపోవడానికి కారణం మరో ఉంది అనే వాళ్ళు ఉన్నారు.

కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత టాస్ లు తక్కువ గెలిచాడు. ఈ టాస్ కూడా గెలవలేదు అనుకుని వెళ్ళిపోయాడు అంటున్నారు ఫాన్స్. అదొకటి అయితే… ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 43 పరుగులకే నాలుగు వికెట్ లు కోల్పోయిన తరుణంలో శివం దూబే, రియాన్ పరాగ్ జట్టుని ఆదుకున్నారు. దాదాపుగా 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్ లో శివం దూబే ఇన్నింగ్స్ బాగా హైలెట్ అయింది.

అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశాలు వచ్చినా అగ్ర జట్లపై అతను ఆడినా సరే అందమైన షాట్ లు ఆడి మంచి స్కోర్ ఎప్పుడూ చేయలేదు. కాని ఈ మ్యాచ్ లో అతను మంచి షాట్ లు ఆడాడు. ఫర్ లు కొట్టాడు… సిక్స్ లు కొట్టాడు. పైగా ఒత్తిడిలో స్వేచ్చగా షాట్ లు ఆడాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన కోహ్లీ ఆశ్చర్యపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో దుబేకి మంచి అవకాశాలు ఇచ్చింది కోహ్లీనే. కాని దూబే ఎప్పుడూ ఆకట్టుకోలేదు.

నమ్మకంతో 4, 5 స్థానాల్లో పంపినా సరే అతను ఫెయిల్ అయ్యాడు. కాని ఈ మ్యాచ్ లో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటీ అంటే అతను అంతకు ముందు కోహ్లీ కెప్టెన్సీ లో బెంగళూరు జట్టుకి ఆడాడు. బెంగళూరు జట్టులో పెద్దగా ఆకట్టుకోలేదు అని రిలీజ్ చేస్తే రాజస్థాన్ కొనుక్కుంది. అలాంటిది బెంగళూరు జట్టుపై రాజస్థాన్ తరుపున మెరుపు ఇన్నింగ్స్ ఆడి న్యాయం చేసాడు.

ఈ ఇన్నింగ్స్ చూసిన కోహ్లీ… జాతీయ జట్టుకి ఆడవేంటి అన్నట్టు కొన్ని హావభావాలు ఇచ్చాడు. దూబేని అవుట్ చేయడానికి బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు. అయినా సరే అతను మంచి స్కోర్ చేసాడు. తన బౌలర్లు పట్టు బిగించినట్టే బిగించి తర్వాత రాజస్థాన్ భారీ స్కోర్ చేసేలా బౌలింగ్ చేయడంపై కూడా కోహ్లీ అసహనంగా కనిపించాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 20 ఓవర్లకు 177 పరుగులు చేసింది.

రాహుల్ తెవాతియా కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దూబే 32 బంతుల్లో 46 పరుగులు చేయగా తెవాతియా 23 బంతుల్లోనే 40 పరుగులు చేసాడు. ఇక్కడ మరో వింత ఏంటీ అంటే… యోయో టెస్ట్ లో తెవాతియా ఫెయిల్ అయ్యాడని జాతీయ జట్టులోకి ఇంగ్లాండ్ టి20 లకు తీసుకోలేదు. అతను కూడా కోహ్లీకి చుక్కలు చూపించాడు. ఇలా ఈ మ్యాచ్ లో కోహ్లీ కంగారు పడ్డాడు అంటున్నారు ఫాన్స్. ఇంకో మాట ఏంటీ అంటే… శివం దూబే, తేవాతియా బాగా ఆడి కోహ్లీని మోసం చేసారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి